ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తమ ఫేవరెట్ హీరో, హీరోయిన్లు.. వారి ఫ్యామిలీ లకు సంబంధించిన ఇంటరెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి అభిమానులు ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ తమ హీరోలు, వారి ఫ్యామిలీల విషయంలో ఎలాంటి కోరికలు ఉంటున్నాయో వాటిని సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్‌ల రూపంలో తెలియజేస్తున్నారు. అంతేకాదు స్టార్ హీరోలు ఎంచుకునే కంటెంట్ కూడా ఇలా ఉంటే బాగుంటుందని.. ఇలాంటి సినిమాల్లో నటించాలంటూ హీరోలను డిమాండ్ చేస్తున్నారు. రకరకాలుగా హీరోలకు కండిషన్స్ పెట్టి వారిని ఇబ్బంది పెడుతున్నారు.
ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఇది మరింతగా ఎక్కువైంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు సంబంధించిన న్యూస్ వైరల్ గా మారుతుంది. బన్నీ పాన్ ఇండియా లెవెల్ లో రాణిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలోనూ సత్త చాటుతున్నాడు. ఇక ఆయన భార్య సినీ ఇండస్ట్రీకి దూరంగానే ఉంటున్నా.. సోషల్ మీడియాలో మాత్రం బన్నీకి పోటీగా ఫ్యాన్ ఫాలోయింగ్ లో సొంతం చేసుకుంటుంది. తన అందంతో పాటు ఫ్యామిలీ లైఫ్ లో లీడ్ చేసే విధానం కూడా బన్నీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఫిజిక్ విషయంలోనూ ఆమె మెయింటైన్ చేసే విధానం.. ఆమె ఫాలో అయ్యే రూల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ముఖ్యంగా పిల్లలను పెంచే తీరు మెప్పిస్తుంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో పాటు.. స్నేహ రెడ్డి ఫ్యాన్స్ కూడా ఓ విషయంలో స్నేహను గట్టిగా రిక్వస్ట్ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు ఈమె ఎన్ని సందర్భాల్లో బయట కనిపించినా.. మీడియా ముందు మెరిసిన.. ఎన్నో సందర్భాల్లో ఆకట్టుకుంటున్న.. ఒక్కచోట కూడా తన గొంతును మాత్రం వినిపించలేదు. ఏ విషయం పై మాట్లాడింది లేదు. అంతే కాదు స్నేహ రెడ్డి మాట్లాడిన మాటలు తాలూకా వీడియోలు కూడా ఇప్పటివరకు ఒక్కటి కూడా రివిల్ కాలేదు. దీంతో బన్నీ ఫ్యాన్స్.. వదినమ్మ ఒక్కసారి మా కోసం ఒక మంచి పాట పాడుతూ వీడియో రిలీజ్ చేయండి అంటూ.. స్లీజ్ వదినమ్మ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి బన్నీ అభిమానుల రిక్వెస్ట్ ను స్నేహారెడ్డి నెరవేరుస్తుందా.. లేదా.. వేచి చూడాలి.