సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ ప్రారంభంలో తెలుగులో అడపాదడపా సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పెదరాయుడు సినిమాలో గెస్ట్ రోల్‌లో మెరిసిన రజనీకాంత్.. ఈ సినిమాకి హైలెట్గా నిలిచారు. అయితే.. ఈ సినిమా తర్వాత రజిని తెలుగు సినిమాల్లో కనిపించింది లేదు. తన తమిళ్ సినిమాలతోనే తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. అయితే.. తర్వాత మరో తెలుగు బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమాలో రజనీకాంత్‌కు ఛాన్స్ వచ్చిన నటించలేదట. అదే తెలుగులో ఈ జనరేషన్ మల్టీ స్టారర్ ట్రెండ్ స్టార్ట్ చేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో.. వెంకటేష్, మహేష్ హీరోలుగా నటించగా.. వీళ్ల తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ మెరిశాడు.
దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా 2013లో ఆడియన్స్‌ను పలకరించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మల్టీ స్టారర్.. ట్రెండ్ సెట్టర్గా మారింది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర కోసం రజనీకాంత్ ని డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలో కలిశాడట. చెన్నైకి వెళ్లి మరి కథ వినిపించగా.. 45 నిమిషాల పాటు కథ విన్న రజినీ.. స్క్రిప్ట్ తనకు బాగా నచ్చినా.. ఆరోగ్యం బాగోకపోవడంతో తను ఇప్పుడు చేయలేనని చెప్పేసాడట. ఇక చేసేదేమీ లేక శ్రీకాంత్ వెనతిరిగాడు. ఇక మరో ఇంటరెస్టింగ్ విషయం ఏంటంటే.. రజనీకాంత్ శ్రీకాంత్ అడ్డాలను చెన్నైలో శ్రీ రాఘవేంద్ర కళ్యాణ మండపంలో కలిసేందుకు అపాయింట్మెంట్ ఇచ్చాడట.
అక్కడికి వెళ్లి కూర్చున్న తర్వాత వెనకాల నుంచి ఓ వ్యక్తి వచ్చి మంచినీళ్లు తాగుతారా అని అడగ్గా.. అబ్బే వద్దులేండి అన్నాడట శ్రీకాంత్. తర్వాత వెళ్లి కాసేపు తర్వాత మళ్లీ వచ్చాడట. ఆయన రజనీకాంత్ అని.. మొదటిసారి వచ్చినప్పుడు నేను రజనీకాంత్‌ను అసలు గుర్తుపట్టలేదని వివరించాడు. ఇంత సింపుల్గా ఉన్నారేంటి అనుకున్నడట శ్రీకాంత్. తర్వాత ఆయనని చూసి షాక్ అయ్యాడట. అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని.. తన లైఫ్ లో రజనీకి కథ చెప్పడం నాకు ఆనందాన్ని కలిగించిందని శ్రీకాంత్ అడ్డల వివరించాడు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.