సౌత్ ఇండియాన్ అవబుల్.. మోస్ట్ పాపులర్ కపుల్‌లో సూర్య, జ్యోతిక జంట కూడా ఒకటి. ఇద్దరూ.. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా కొనసాగుతున్న క్రమంలో.. ఇద్దరు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్యన స్నేహం కాస్త ప్రేమగా మారడంతో.. ఇరు కుటుంబాలను ఒప్పించి.. పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇక వీరికి ఓ పాప, బాబు ఉన్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జ్యోతిక.. ఏస్.జే.సూర్య డైరెక్షన్లో వాలి సినిమాలో హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. మొదటి సినిమాతోనే తన నటనకు ప్రశంసలు అందుకుంది.
ఇక తర్వాత.. సౌత్‌లో బిజీ హీరోయిన్గా మారిపోయింది. తెలుగు, తమిళ్లో ఎన్నో సినిమాల్లో నటించింది. ఇలాంటి క్రమంలోనే సూర్య, జ్యోతికతో కలిసి మాయావి, సిల్లును వారు కాదల్ లాంటి సినిమాల్లో ఆకట్టుకుంది. 2006లో వీరి వివాహం గ్రాండ్ లెవెల్‌లో జరిగింది. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనా ఈ అమ్మడు.. ఇద్దరు పిల్లల బాధ్యతలు చూసుకుంటూ బిజీగా ఉంది. తన 36 ఏళ్ల వయసులో సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన జ్యోతిక.. గతంలో విజయ్ దళపతి సినిమాల్లో ఛాన్స్ వచ్చినా కూడా దానిని రిజెక్ట్ చేసిందట. అయితే.. ప్రస్తుతం ముంబాయికి మక్కాం మార్చేసిన ఈ జంట.. ఎవరికి సినిమాల్లో వాళ్ళు బిజీగా గడుపుతున్నారు.
జ్యోతిక సినిమాలతో పాటు.. వెబ్ సిరీస్‌లలో రాణిస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం డబ్బా కార్టెల్ సిరీస్‌లో నటిస్తున్న జ్యోతిక.. ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా పాల్గొంటుంది. ఇందులో.. జ్యోతిక పోస్టుపై ఓ వ్యక్తి.. నీ భర్త కంటే విజయ్ చాలా మెరుగ్గా ఉన్నాడు అంటూ విమర్శత్మకంగా కామెంట్ చేశాడు. దీనిపై జ్యోతిక ఒకే ఒక్క సింపుల్ ఇమేజితో రియాక్ట్ అయ్యారు. ఆమె నవ్వుతున్న ఓ ఇమేజిను షేర్ చేసుకున్నారు. అయితే.. దానిపై అతను రియాక్ట్ అవుతూ సారీ మామ్.. సూర్య సార్ వాజ్ వెరీ లవబుల్ అంటూ మెసేజ్ ను షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం అతను చేసిన మొదటి కామెంట్‌కు కూడా జ్యోతిక రియాక్ట్ అయిన సింపుల్ విధానాన్ని ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.