సినీ ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోల నుంచి.. స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక ట్యాగ్ వినిపిస్తూనే ఉంటుంది. ఆశ్చర్యం ఏంటంటే.. కొంతమంది అభిమానులు.. హీరోలకు ఆ ట్యాగ్స్ ఇస్తుంటే.. కొన్ని కొన్ని సార్లు తోటి హీరోలే ఇతర హీరోలకు ట్యాగ్స్ ఇస్తారు. వాటిని హైలెట్ చేస్తూ ఉంటారు. మరియు ముఖ్యంగా ఇండస్ట్రీలో పవర్ స్టార్‌గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న పవన్‌కు అయితే పవర్ స్టార్ అనే ట్యాగ్‌ను బండ్ల గణేష్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అది ఇప్పటికి మంచి ఫామ్‌లో ఉంది.
ఇక మెగాస్టార్ అనగానే అందరికీ టక్కున చిరంజీవి పేరే గుర్తుకొస్తుంది. ఆయన బ్యాక్ గ్రౌండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి సహాయం లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అంచెలంచలుగా ఎదుగుతూ.. సొంత టాలెంట్‌తో స్టార్ హీరోగా మారారు చిరంజీవి. వరుస సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకోవడంతో.. మెగాస్టార్ ఇమేజ్ సొంతమైంది. అయితే.. మెగాస్టార్ ట్యాగ్ స్వయంగా అభిమానుల నుంచి చిరంజీవికి దక్కింది.
ఇక చిరు కంటే ముందు ఈ మెగాస్టార్ ట్యాగ్ శోభన్ బాబుకు దక్కవలసిందట. కోట్లాదిమంది లేడీ సంపాదించుకున్న శోభన్ బాబు.. వరుస సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లో అందుకుంటూ రాణించాడు. అలాంటి క్రమంలో ఆయనకు మెగాస్టార్ ట్యాగ్ కాకుండా.. లేడీ ఫాలోయింగ్ కూడా దృష్టిలో పెట్టుకొని.. ఆంధ్ర అందగాడనే ట్యాగ్ జోడించారు జనం. తర్వాత.. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లతో రాణిస్తున్న చిరంజీవికి మెగాస్టార్ ఇమేజ్ దక్కింది. అయితే లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంతోనే మెగాస్టార్ ట్యాగ్ అంటే.. ఆంధ్ర అందగాడనే ట్యాగ్ బాగా అడాప్ట్ అవుతుందని జనం శోభన్ బాబుకు ఆ ట్యాగ్‌ను జత చేశారు. అలా శోభన్ బాబును మిస్ అయ్యి.. చిరు కి మెగాస్టార్ ట్యాగ్ ఫిక్స్ అయ్యింది.