బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తికి టాలీవుడ్ ఆడియన్స్ లోను ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గోపాల గోపాల సినిమాల్లో కీలకపాత్రలో మెరిసిన మిధున్.. ఈ సినిమాతో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే.. ప్రస్తుతం మిథున్ చక్రవర్తి తనయుడు మీమో చక్రవర్తి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నాడు. నేనెక్కడున్నా మూవీతో మీమో చక్రవర్తి టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక ఎయిర్టెల్ ఫేమ్ సాషా చైత్రి హీరోయిన్గా కనిపించనుంది. కేబిఆర్ సమర్పణలో.. మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు మాధవ్ కోదాడ దర్శకుడుగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా శుక్రవారం ఫిబ్రవరి 28న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే భీమ చక్రవర్తి టాలీవుడ్ మీడియాతో ముచ్చటించాడు. ఓ ఇంటర్వ్యూలో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు.
థాంక్యూ.. మొత్తానికి ఫిబ్రవరి 28న నేనెక్కడున్నా సినిమా రిలీజ్ అవుతున్నందుకు సంతోషంగా ఉంది. నా చైల్డ్హుడ్ అంతా సౌత్ సినిమాలను చూస్తూ హ్యాపీగా గడిపేసా. ఊటీలో మా నాన్నగారికి హోటల్ ఉంది. నేను అక్కడ ఉన్నాను. అందువల్ల తెలుగు, తమిళ్ సినిమాలు చూస్తూ పెరిగా అంటూ వివరించాడు. ఇక మీ నాన్నగారికి టాలీవుడ్ సినిమా అవకాశం వచ్చిందని చెప్పినప్పుడు.. ఆయన రియాక్షన్ ఏంటి అని ప్రశ్నించగా.. చాలా సంతోషంగా ఫీల్ అయ్యారని.. హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వు అన్నారని వివరించాడు. ఆర్టిస్టులు, హీరో, హీరోయిన్లకు భాష అడ్డుగానే కాదు.. కాకూడదు.. నేను తెలుగులో సినిమా చేశా.. రేపు అవకాశం వస్తే తమిళ్, మలయాళ, పంజాబీ, భోజ్‌పురిలో చేస్తాను.
నాకు తెలుగు సినిమాల్లో అవకాశాలు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు అంటూ వివరించాడు. భాషరాదని అసలు ఆలోచించకు అన్నారని వివరించాడు. ఇక తెలుగులో మీ ఫేవరెట్ హీరోలు ఎవరు అని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్, ప్రభాస్, విజయ్ దళపతి అంటే చాలా ఇష్టం. రజనీకాంత్ అన్న కూడా ఇష్టమే. వారికి నేను అభిమానిని. మిగతా సార్ హీరోలు అందరితోనూ కూడా సినిమాలు చేయాలని ఉందంటూ వివరించాడు. ఇక మీరు ప్రస్తుతం హీరోగా చేస్తున్నారు.. ఒకవేళ ఆ హీరోలతో విలన్ రోల్స్ లో నటించాల్సి వస్తే చేస్తారా అని అడిగిన ప్రశ్నకు.. తప్పకుండా చేస్తా. విలన్ రోల్ కు నేను పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతానని భావిస్తున్నాను. నటుడుగా నేను లిమిట్స్‌ని పెట్టుకోలేదు. మంచి క్యారెక్టర్ వస్తే కమెడియన్, సపోర్టింగ్ రోల్స్ సైతం చేయడానికి రెడీ అంటూ వివరించాడు. ప్రస్తుతం మీమో చక్రవర్తి చేసిన కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి.