మెగా-నంద‌మూరోళ్ల ఫేవ‌రెట్ డైరెక్ట‌ర్‌తో నాగార్జున 100వ సినిమా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేక ఇమేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో ఈ కుటుంబంలోని హీరోలపై ఎక్కువగా వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. ఎన్నో రకాలుగా ట్రోల్లింగ్స్‌ జరుగుతున్నాయి. ఇకపై అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన హీరోల సినిమాలు రికార్డులు క్రియేట్ చేయడం అసలు అసాధ్యమని.. రూ.100 కోట్లు క్రాస్ అయినా చేయగలరా అంటూ రకరకాలుగా నెగిటివ్ కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి క్రమంలోనే సైలెంట్‌గా నాగచైతన్య ట్రోలర్స్‌కు, నెగటివ్ కామెంట్స్ కు గట్టి కౌంట‌ర్ వేశాడు. రీసెంట్‌గా వచ్చిన తండేల్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడమే కాదు.. ఆయన ఎప్పటినుంచో కలలు కన్నా రూ.100 కోట్ల క్లబ్ లోకి కూడా సినిమా చేరిపోయింది.

Vassishta: ఎక్స్‌లో చిరూపై విశ్వంభ‌ర డైరెక్ట‌ర్ పోస్ట్ - Latest Telugu News  | తెలుగు వార్తలు | NRI Telugu News Paper in USA - Telugu Times

దీంతో సోషల్ మీడియాలో చైతు హైలెట్‌గా మారాడు. అంతేకాదు.. తాజాగా చైతు.. తండేల్ మూవీ సక్సెస్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఇలాంటి క్రమంలో.. నాగార్జున కెరీర్‌లో ఎంతో స్పెషల్ అయిన 100వ‌ సినిమా డైరెక్టర్‌కు సంబంధించిన పేరు నెటింట‌ తెగ వైరల్‌గా మారుతుంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. చిరంజీవి. విశ్వంభరతో బ్లాక్ బస్టర్ అందుకోవాలని ఆరాటపడుతున్న వశిష్ట. ఇక గతంలోను నంద‌మూరి కళ్యాణ్ రామ్‌కు బింబిసారా మూవీతో భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు.

Nagarjuna Biography

మరోసారి త‌న మార్క్ స‌క్స‌స్ చూపించ‌నున్నాడు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. చిరంజీవి లాంటి స్టార్ డైరెక్టర్ వశిష్టకు విశ్వంభరతో అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు నాగార్జున కూడా అదే ప్లాన్ చేస్తున్నాడట. తన కెరీర్‌లోనే ఎంతో స్పెషల్.. ఎప్పటికీ గుర్తుండిపోయే 100వ‌ సినిమా కోసం వశిష్టకు నాగార్జున ఛాన్స్ ఇచ్చాడట. ప్రజెంట్ ఇదే న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. ఒకవేళ ఈ రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకుంటే.. ఇక వశిష్టకు టాలీవుడ్ లో తిరిగుండదు అనడంలో సందేహం లేదు. మరింత మంది స్టార్ హీరోలతో అవకాశాలను దక్కించుకుని జట్‌ స్పీడ్‌లో దూసుకుపోతాడు అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.