తల్లిగా చేసిన నటితోనే.. మహేష్ రొమాన్స్.. ఈ జనరేషన్ హీరోల్లో ఆయనకే సాధ్యం..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 2004లో ఎస్‌.జే.సూర్య డైరెక్షన్‌లో నటించిన నాని సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. సైన్స్ ఫ్రిక్షన్ కామెడీ మూవీగా.. అడల్ట్ జోకులతో తెర‌కెక్కిన ఈ సినిమా.. తమిళ్లో మంచి సక్సెస్ అందుకుంది. కాగా.. తెలుగులో డిజాస్టర్ కావడానికి కామెడీ, సైన్స్ ఫ్రిక్షన్ స్టోరీ కారణమంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తెలుగు ఆడియన్స్‌కు అడ‌ల్ట్‌ కంటెంట్ ఎక్క‌క‌పోవడంతో సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో మార్కండేయ అంటూ ఐటమ్ సాంగ్ కొనసాగుతుంది.

ఈ సాంగ్లో మహేష్ బాబు, రమ్యకృష్ణ హాట్ స్టెప్స్ తో దుమ్ము లేపారు. కాగా తనకంటే ఆరేళ్లు పెద్దదైన రమ్యకృష్ణతో రొమాన్స్ చేస్తూ మహేష్ స్టెప్స్ వేయడం పై ఎన్నో విమర్శలు తలెత్తాయి. ఈ క్రమంలోనే థియేటర్లలో సాంగ్ కట్ చేసిన.. యూట్యూబ్లో మాత్రం ఇప్పటికీ వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన ఐటమ్ సాంగ్ కనిపిస్తూనే ఉంది. 20 ఏళ్ల తర్వాత ఇదే రమ్యకృష్ణతో మహేష్ బాబు కొడుకు పాత్రలో నటించారు. అదే మహేష్ నుంచి చివరిగా తెర‌కెక్కిన గుంటూరు కారం.

త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన గుంటూరు కారంలో రమ్యకృష్ణ.. మహేష్ తల్లిగా మెరిసింది. ఇలా రొమాన్స్ చేసిన న‌టితో కొడుకుగా చేసిన ఘనత ఈ జనరేషన్ హీరోలలో కేవలం మహేష్ బాబుకు మాత్రమే దక్కింది. అయితే ప్రభాస్ అడవి రాముడు సినిమాలోని రమ్యకృష్ణతో ఐటెం సాంగ్ లో మెరిసినా ప్రభాస్, రమ్యకృష్ణ మధ్య డ్యాన్స్ స్టెప్స్ ఉండవు. అసలు రొమాన్స్ ఉండదన‌ సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్‌కు తల్లిగా బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ శివ‌గామి పాత్ర‌లో న‌టించి.. మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది.