జయం మూవీ సదా చెల్లెలు గుర్తుందా.. ఇప్పుడెలా ఉందో.. ఏం చేస్తుందో తెలుసా..?

టాలీవుడ్ క్రేజీ హీరో నితిన్ హీరోగా, సదా హీరోయిన్గా మెరిసిన జయం మూవీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తేజ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. సినిమాలో.. నటీనటుల పర్ఫామెన్స్ కు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఈ సినిమాల్లో సదా చెల్లెలుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా అందరిని ఆకట్టుకుంది. ఇంతకీ ఆమె పేరు చెప్పలేదు కదా.. తనే యామిని శ్వేతా. జయం సినిమా తర్వాత యామిని శ్వేత ఏ సినిమాలోను కనిపించలేదు.

ఎన్నో ఆఫర్లు వచ్చిన వాటిని రిజెక్ట్ చేసింది. అయితే ఆమె సినిమా అవకాశాలు వదులుకోవడానికి కారణమేంటి.. ఇండస్ట్రీకి యామిని శ్వేత‌.. ఎందుకు దూరమైందో తన తల్లి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. యామిని శ్వేత తల్లి కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడం విశేషం. ఇక సినీ ఇండస్ట్రీలో ఆమె లైఫ్ నిలబెట్టుకోవడానికి చాలా బాధపడాల్సి వచ్చిందని.. ఆ బాధలు యామినికి కూడా రాకూడదని ఆమె భావించిందట. ఈ క్రమంలోనే కూతురిని బాలు నటిగా చూడాలని ఆశ ఉండేదని.. ఆ కోరిక తనకు తీరింది అంటూ చెప్పుకొచ్చింది.

Jayam movie child artist yamini swetha family photos . . . #jayam  #yaminiswetha

తర్వాత సినీ ఇండస్ట్రీలో చాలా అవకాశాలు వచ్చాయి. కానీ.. సినిమాలు చేసేందుకు యాక్సెప్ట్ చేయలేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం యామిని శ్వేత పెళ్లి చేసుకుని అమెరికాలో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇక తన మాటను కూతుర్లు ఎప్పుడు కాదనలేదని.. అంతకన్నా సంతోషం ఇంకేం ఉంటుంది అంటూ యామిని శ్వేత తల్లి జయలక్ష్మి వివరించింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం యామిని శ్వేత పెళ్లి చేసుకుని.. ఓ బిడ్డకు జన్మనిచ్చి.. అమెరికాలోనే హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఆమెకు సంబంధించిన ఫ్యామిలీ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అంతేకాదు.. ఆమెకు విజయవాడలో భారీగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం.