అఖండ 2పై ఆది పినిశెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఒక్క కామెంట్ తో అంచనాలు రెట్టింపు..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ సినీ ప్రస్థానం గురించి చెప్పాలంటే ఆఖండకు ముందు.. అఖండ తర్వాత అనే మాట్లాడుకోవాలి. అఖండ‌ ముందు వరకు వరుస ప్లాపులతో సతమతమైన బాలయ్య.. అఖండ నుంచి సక్సెస్ ట్రాక్ లోకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్‌లు అందుకుంటు దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా నాలుగు సార్లు సక్సెస్ సాధించాడు. ఇక బాలయ్య సినీ కెరీర్‌లో.. హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమా కూడా అఖండనే. బోయపాటి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా.. అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక వీరిద్దరి కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వ‌చ్చి బ్లాక్ బస్టర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య మరోసారి అఖండ సీక్వెల్‌తో.. ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు.

బోయపాటి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా.. ప్రస్తుతం షూటింగ్ పనులు శ‌ర‌వేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాలో విలన్ రోల్ లో యంగ్ హీరో ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. ఇదివరకే బోయపాటి డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా వ‌చ్చిన‌ సరైనోడు మూవీలో ఆది పినిశెట్టి విలన్‌గా నటించి మంచి మార్కులు కొట్టేసాడు. ఈ క్రమంలోనే బోయపాటి మరోసారి బాలయ్య‌కు విలన్‌గా ఆది పినిశెట్టిని సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆది పినిశెట్టి అఖండ 2 గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు. ఆయన చేసిన ఒకే ఒక్క కామెంట్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసేసింది.

Aadhi Pinisetty About Akhanda 2 Movie | Balakrishna | Shabdham Pre Release  Event - YouTube

ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. ఇప్పుడే అఖండ 2 గురించి ఏం చెప్తాం.. అయినా ఓ షెడ్యూల్ పూర్తయింది.. చాలా మంచి ఎక్స్పీరియన్స్. బోయపాటి గారు, బాలయ్య గారు కాంబినేషన్ గురించి అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే పవర్ ప్యాకెడ్‌ ఎనర్జీ పక్కా.. అందులో నేను కూడా భాగం అవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఫస్ట్ షెడ్యూల్ నాకు చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది అంటూ ఆది పినిశెట్టి వెల్లడించాడు. అంతేకాదు ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న థ‌మన్‌ కూడా.. గతంలో ఫస్ట్ హాఫ్ తోనే ప్రేక్షకులు టికెట్ ఖ‌ర్చుకు న్యాయం జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఆది పినిశెట్టి చేసిన కామెంట్స్.. మరోసారి వైరల్ కావడంతో అభిమానుల్లో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.