బాలయ్యకు ఫెవ‌రెట్‌ చిరు మూవీ ఏదో తెలుసా.. ఏకంగా అన్నిసార్లు చూశాడా..?

టాలీవుడ్ నందమూరి నరసింహ బాలకృష్ణ సీనియర్ స్టార్ హీరోగా ఈ ఏజ్‌లోను వరుస బ్లాక్ బ‌స్టర్ హిట్‌లు అందుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అంతే కాదు.. మెగాస్టార్ చిరంజీవి కూడా తనదైన స్టైల్‌తో రాణిస్తున్నాడు. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా మెగాస్టార్ గా తిరుగులేని క్రేజ్‌తో.. భారీ ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా గడిపేస్తున్నాడు. ఇక బాలయ్యకు.. చిరంజీవికి మొదటి నుంచి మంచి స్నేహం ఉందని సంగతి తెలిసిందే. అభిమానులు మా హీరో గొప్ప అంటే.. మా హీరో గొప్ప అంటూ గొడవలు పడుతున్నా.. ఇద్దరికీ ఒకరు సినిమాతో.. ఒకరికి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చుకుంటూ ఎన్నో సార్లు టఫ్ ఫైట్ ఎదుర్కొన్న.. వీళ్ల‌ స్నేహాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు.

Watch Jagadeka Veerudu Athiloka Sundhari (Telugu) Full Movie Online | Sun  NXT

ఒకరి ఇంట్లో ఫంక్షన్లకు మరొకరు హాజరవుతూ సందడి చేస్తూనే ఉంటారు. ఇలాంటి క్రమంలోనే బాలయ్య తన క్లోజ్ ఫ్రెండ్.. టఫ్ కాంపిటేటర్ అయినా చిరంజీవి నటించిన సినిమాల్లో తన ఫేవరెట్ మూవీ ఏంటో వెల్లడించాడు. ఓ ఈవెంట్లో తను మాట్లాడుతూ.. ఇప్పటికే వందసార్లకు పైగా చిరంజీవి నటించిన ఆ సినిమాను చూశాను అంటూ.. అంత‌గా సినిమా అంటే ఇష్టం అని చెప్పడం వైర‌ల్‌గా మారుతుంది. ఇంతకీ ఆ మూవీ మరేదో కాదు.. అతిలోక‌సుంద‌రి.. దివంగ‌త‌ శ్రీదేవి హీరోయిన్‌గా నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి.

Chiranjeevi Vs Balakrishna Box Office Clash List

ఈ సినిమాకు టాలీవుడ్‌లోనూ ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికి ఎవర్‌గ్రీన్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిపోయిన చిరు సినిమాల్లో.. ఇది టాప్ లిస్టులో ఉంటుంది. అయితే ఇదే సినిమా బాలయ్యకు కూడా ఫేవరెట్ అని తెలియడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. అయితే బాలయ్య.. చిరంజీవి నటించిన ఈ సినిమాని ఏకంగా వంద‌కంటే ఎక్కువ సార్లు చూశానని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా ఒక బాలయ్యకే కాదు.. చిరంజీవి ఫ్యాన్స్ కు మాత్రమే కాదు.. సాధారణ ఆడియన్స్‌కు కూడా ఎంతోమందికి ఫేవరెట్ మూవీ. ఈ సినిమాలో చిరు నటన, శ్రీదేవి అభినయం ఆడియన్స్‌ను కట్టిపడేసింది.