టాలీవుడ్ స్టార్ హీరోగా విక్టరీ వెంకటేష్ తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఆడియన్స్‌లో ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న వెంకీ మామ.. దాదాపు రెండు దశాబ్దాల నుంచి సరైన బ్లాక్ బస్టర్ లేక సతమతమవుతున్నాడు. అలాంటి వెంకటేష్‌కు తాజాగా సంక్రాంతి బరిలో.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ వచ్చింది. ఇప్పటికి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ వసూళను కొల్లగొడుతూనే ఉంది. వెంకటేష్‌కు సరైన బ్లాక్ బస్టర్ హిట్ పడితే.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి క్రౌడ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా మూడు వారాలు కావస్తున్న ఇప్పటికీ ఆడుతూనే ఉందంటే.. ఓ సాధారణ కమర్షియల్ సినిమా హిట్ అయ్యి పాన్ ఇండియా లెవెల్ లో కలెక్షన్లు కొల్లగొడుతూ దూసుకుపోతుంది.. ఇప్పటికే రూ.300 కోట్ల గ్రాస్ వసూళు రాబట్టింది అంటే.. వెంకటేష్ క్రేజ్ ఏంటో అర్థం అయిపోతుంది. అయితే సంక్రాంతికి వస్తున్నాం బ్తాక్ బస్టర్ తర్వాత.. వెంకీ మామ ఏ సినిమాలో నటించబోతున్నాడని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. రీసెంట్ గానే ఆయన మైత్రి మూవీ మేకర్స్‌తో సినిమా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా పుష్ప 2 లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మైత్రి మేకర్స్.. వెంకటేష్ సినిమాను ప్రొడ్యూస్ చేయడం నెటింట హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఈ సినిమాకు ప్రముఖ డైరెక్టర్ వెంకి అట్లూరి దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. సార్, లక్కీ భాస్కర్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న వెంకీ అట్లూరితో సినిమా అంటే ఆడియన్స్‌లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా రిలీజ్ అయిన లక్కీ భాస్కర్ ఎలాంటి ప్రభంజనం సృష్టించింది చూస్తూనే ఉన్నం. నెట్ ఫ్లిక్స్‌లో రిలీజై దాదాపు రెండు నెలలు పూర్తయినా.. ఇప్పటికీ నాన్ స్టాప్ స్ట్రీమింగ్ అవుతూనే ఉంది. ఇక ఈ సినిమా తర్వాత.. తమిళ్ హీరో సూర్యతో.. వెంకీ అట్లూరి సినిమా చేస్తున్నాడని వార్తలు వినిపించాయి. కానీ.. వెంకటేష్‌తో తన ప్రాజెక్టును లాక్ చేసినట్లు తాజా సమాచారం. వెంకటేష్ వయసుకు తగ్గ పాత్రను ఆయన డిజైన్ చేశాడట. వెంకీ అట్లూరి సినిమాలని మన్న సమాజం.. మన చుట్టూ ఉండే పాత్రలను.. టచ్ చేస్తూ కనిపిస్తాయి. అవి ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతాయి. ఈ క్రమంలోనే కమర్షియల్ సినిమాలతో సక్సెస్ సాధించడంలో దిట్టగా మారాడు వెంకీ అట్లూరి. అలా వెంకటేష్ కు కమర్షియల్ గా మరో బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు ఆయన సిద్ధమవుతున్నాడని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాల అఫిషియల్ ప్రకటన రానుందట.