బిచ్చగాడిగా మారిన‌ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. గెస్ చేస్తే మీరు జీనియస్..!

ఒకప్పుడు దేశం మొత్తంలో రాజుల పాలన నడుస్తూ ఉండేది. అలాంటి సమయాల్లో రాజులు, యువరాజులు వ్యాపారులుగా.. సామాన్యులుగా వేషాలు కట్టి తమ సొంత రాజ్యంలో వీధుల్లో తిరుగుతూ.. పాలన ఎలా ఉందో తెలుసుకునే వారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులే లేవు. ఇప్పుడు అసలు రాజులపాలన‌ లేకుండా పోయింది. కాగా ప్రస్తుతం స్టార్ హీరో, హీరోయిన్లు, క్రీడారంగానికి చెందిన సెలబ్రిటీలు ఎంతోమంది గెటప్ లు మార్చుకొని సాధారణ మనిషిలా జనాల మధ్యలో తిరగాలని ఆరాటపడుతున్నారు. అలా తమ సొంత సినిమాలను చూడడానికి వాళ్ళ గెటప్ మార్చుకునే థియేటర్‌ల‌కు వెళ్లిన‌ సెలబ్రిటీలు ఎన్నోసార్లు వార్తల్లో వైరల్ అయ్యారు.

అయితే గెటప్ మార్చుకొని జనం మధ్యలోకి వెళ్లిపోయి.. వాళ్లకు దగ్గరగా ఉంటూ.. వారితో మాట్లాడే సాహసం సాధారణంగా స్టార్ హీరోలు ఎవరు చేయరు. కానీ.. ఇటీవల ఓ సూపర్ స్టార్ అలాంటి సాహసమే చేశారు. ముంబై వీధుల్లో రాతియుగపు వ్యక్తిగా వేషం ధరించి తిరుగుతూ కనిపించాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అదే ఈ పై ఫోటోలో చూస్తున్న స్టార్ హీరో. అతను ఎవరో గెస్ చేస్తే నిజంగా మీరు జీనియస్. ఇండియా సూప‌ర్ స్టార్‌గా తిరుగులేని క్రేజ్‌తో రాణిస్తున్న ఈ స్టార్ హీరును గుర్తుపట్టారా.. సర్లేండి మేము చెప్పేస్తాం. అతను ఎవరో కాదు బాలీవుడ్ సూపర్ స్టార్ మిస్టర్ పర్ఫెక్ట్ గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న అమీర్ ఖాన్.

Aamir Khan to tell a special 'kahaani' on April 28 : Bollywood News - Bollywood Hungama

అమీర్ ఖాన్ బిచ్చగాడు వేషం వేసుకొని ముంబై వీధుల్లో తిరుగుతూ బిక్షాట‌న‌ చేశాడు. అయితే మొదట ఈ వీడియో వైరల్ గా మారడంతో ముంబై వీధుల్లో ఎవరు విచిత్రమైన వ్యక్తి సంచరించాడని అంత అనుకున్నారు. కానీ.. అమీర్ ఖాన్ మేకప్ వేసుకుంటున్న వీడియో, పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ముంబై వీధుల్లో అలా తిరిగింది అమీర్ ఖాన్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. అమీర్ ఖాన్ ఇలాంటి వింత వేషధారణలో ముంబై వీధిలో ఎందుకు తిరుగుతున్నాడో తెలియలేదు. కానీ అది సినిమా కోసం అని కొంతమంది భావిస్తుంటే.. ఏదో యాడ్ షూట్ కోసం కావచ్చని మరి కొంతమంది చెప్తున్నారు. గతంలోనూ అమీర్ ఖాన్ మారవేషాలు వేసుకుని నగర వీధిలో తిరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కాగా గతంలో సౌరవ్ గంగూలీ ఇంటికి అమీర్ మారువేషంలో వెళ్లారు.