మెగాస్టార్ చిరంజీవి నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోగా గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న చరణ్ నుంచి.. తాజాగా వచ్చిన మూవీ గేమ్ ఛేంజర్. శంకర్ డైరెక్షన్‌లో పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్‌కు ముందు వరకు భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన నెగిటివ్ ట్రౌలింగ్స్ ఫ్యాన్స్‌కు చాలా ఇబ్బంది కలిగించడమే కాదు.. సినిమాను కూడా అట్టర్ ప్లాప్ అయ్యేలా చేశాయి. సినిమా ఫ్లాప్ టాక్ రావడానికి ప్రధాన కారణమే నెగటివ్ ట్రోల్స్ జరగడం అంటూ అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇక సినిమా ఫ్లాప్ అంటే కారణాలు కథ బాలేదు, కంటెంట్ లేదు, యాక్షన్ సీన్స్ బాలేదు ఇలాంటివి ఉంటాయి.
కానీ ఈ సినిమాపై వచ్చిన నెగిటివ్ ప్రచారం ఎవరు ఊహించలేదు. ఫస్ట్ డేనే రూ.186 కోట్లు కలెక్ట్ చేసిందంటూ ఫేక్ కలెక్షన్లు వేశారని నెగిటివ్ ట్రోల్స్ మొదలయ్యాయి. కలెక్షన్లను ఎంతోమంది ట్రోల్ చేశారు. దీని పట్ల పలువురు స్టార్స్ కూడా పరోక్షంగా మెగా హీరోకి కౌంటర్లు ఇచ్చారు. అయితే ఇలాంటి క్రమంలో చరణ్ తన కెరీర్‌లో కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలను చరణ్ మిస్ చేసుకున్నాడని.. వాటిలో ప్రభాస్ నటించి హిట్లు అందుకున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ మూడు సినిమాలేంటో ఒకసారి చూద్దాం. ప్రభాస్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన ఛత్రపతి. ఈ సినిమాను మొదట రామ్ చరణ్‌తో కెక్కించాలని భావించారట. అయితే అంతకుముందే రాజమౌళితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకున్న చరణ్ సినిమాను నో చెప్పేసాడట. అంతేకాదు హీరో మాస్ ఎలివేషన్స్ పాత్ర.. నా బాడీకి అసలు సూట్ కాదంటూ జక్కన్న సినిమాను సున్నితంగా రిజెక్ట్ చేశాడట.
ఇక ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ గా మారిన తర్వాత వరుస ఫ్లాప్‌ల క్రమంలో సలార్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ముందుగా ప్రశాంత్ నీల్ రామ్‌చరణ్‌కు వినిపించాడట. మాస్ ఎలివేషన్ పాత్రను అంతగా ఇష్టపడని చరణ్.. ఆ మూవీని కూడా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఇటీవల కాలంలో సూపర్ డూపర్ హిట్ అందుకున్న కల్కి మూవీ కూడా మొదట చరణ్‌కె వెళ్ళింది. అయితే రామ్ చరణ్ కథ విని స్టోరీ ఎక్కడో తేడా కొడుతుంది. ఇలాంటి కాన్సెప్ట్ జనాలు ఇష్టపడతారో.. పడరో.. అనే సందేహంతో కథను రిజెక్ట్ చేసాడట. అలా ప్రభాస్ నటించి బ్లాక్ బస్టర్లు అందుకున్న ఈ మూడు సినిమాలను చరణ్ మిస్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో.. ఈ మూడు సినిమాల్లో కనీసం ఏ రెండు సినిమాల్లో చరణ్ నటించి ఉన్న చరణ్ ఇమేజ్ వేరే లెవెల్‌లో ఉండేది అంటూ.. ఈ సినిమాలని రిజెక్ట్ చేసి చరణ్ తప్పు చేశాడంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.