ఎవడు సినిమా దేవా ఇద్దరు భార్యలు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్స్ అని తెలుసా..?

టాలీవుడ్ విలన్ జాన్ కొక్కెన్‌ పేరు చెప్పగానే టక్కున గుర్తుకు రాకున్నా ఫోటో చూస్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఎన్నో సినిమాల్లో విల‌న్‌గా నటించిన ఈయ‌నకు న‌టుడిగా మంచి ఇమేజ్ తెచ్చి పెట్టింది మాత్రం కేజీఎఫ్ సినిమానే. డాన్ శీను సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి.. సైడ్ విలన్ గా కనిపించాడు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తీన్మార్‌లోను మెరిశాడు. కృతికర్బందా అన్నగా కనిపించిన జాన్.. తర్వాత నేనొక్కడినే, బాహుబలి, బ్రూస్లీ, జనతా గ్యారేజ్, వీరసింహారెడ్డి, ఎవడు ఇలా.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ విఇల‌న్‌గా ఆకట్టుకున్నాడు.

Happy Birthday Meera Vasudevan | Photo 4 of 4

ఇక తెలుగులో విలన్ గా మంచి ఇమేజ్ తెచ్చి పెట్టిన ఎవ్వడు సినిమాల్లో దేవ పాత్రలో కనిపించిన జాన్ తర్వాత.. కేజిఎఫ్ సినిమాలోని జాన్ పాత్రలో కుమ్మేసాడు. కేజీఎఫ్ 2 కూడా విలన్ గా మరింత హై రేంజ్ రోల్ సంపాదించుకున్నాడు. ఇక ఈయన ఇద్దరు భార్యలు కూడా తెలుగులో క్రేజీ హీరోయిన్స్ అనే సంగతి చాలా మందికి తెలిసి ఉండదు. వాళ్ళల్లో ఒకరు పూజ రామచంద్ర. తెలుగులో ఫేమస్ నటి. నిఖిల్ హీరోగా నటించిన స్వామి రారా సినిమాలో మెయిన్ రోల్‌లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. సిద్ధార్థ హీరోగా తెరకెక్కిన లవ్ ఫెయిల్యూర్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

Meera Vasudevan Ex-husband John Kokken Opens Up His Wife Pooja And Her Supports | ഭാര്യമാര്‍ക്ക് അത് കണ്ടിട്ട് സഹിക്കാന്‍ പറ്റിയില്ല; ഷൂട്ടിങ് ലൊക്കേഷനില്‍ വന്ന പൂജയെയും ...

తర్వాత దోచేయ్‌, త్రిపుర, కృష్ణార్జున యుద్ధం, పవర్ ప్లే, స్వామిరారా ఇలా ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అయితే జాన్‌కు పూజ మొదటి భార్య‌ కాదు. అతని ఫస్ట్ భార్య పేరు మీరా వాసుదేవన్. ఈమె ఇండస్ట్రీ ఎంట్రీనే టాలీవుడ్ సినిమాలతో జరిగింది. జె.డి.చక్రవర్తి హీరోగా తెర‌కెక్కిన గోల్‌మాల్ సినిమాల్లో మీర ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే ఈ సినిమా కాకుండా అంజలి ఐ లవ్ యు సినిమాలో మాత్రమే తెలుగులో నటించిన మీర‌ తర్వాత తమిళ, హిందీ భాషల్లో వరుస అవకాశాలు దక్కించుకుంది. అన్నిటికంటే ఎక్కువగా మలయాళ సినిమాల‌లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది.