ప్రముఖ టాలీవుడ్ నటుడు యజ్ఞం సినిమా విలన్ విజయ రంగరాజు.. అలియాస్ రాజ్ కుమార్ కొద్ది సేపటి క్రితం కనుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో సతమతమవుతున్న ఆయన.. చెన్నైలోనే ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చివరి శ్వాస విడిచాడు. అకస్మాత్తుగా ఆయనకు హార్ట్ ఎటాక్ రావడంతో విజయ రంగరాజు మరణించినట్లు చెప్తేన్నారు. వారం రోజుల క్రితం హైదరాబాద్‌లో ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్న విజయ రంగరాజు.. గాయపడటంతో ట్రీట్మెంట్ కోసం చెన్నైకి తీసుకువెళ్లారు.
ఈలాంటి క్రమంలో హఠాతుగా గుండెపోటుతో ఆయన మరణించడం టాలీవుడ్ సినీ పరిశ్రమను విషాదానికి గురిచేసింది. ప్రముఖ దర్శకుడు బాపూ దర్శకత్వంలో వచ్చిన సీత కల్యాణంలో.. రంగరాజు నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టొ తన సినీ ప్రయాణం మొదలుపెట్టాడు. అయితే 1994 లో వచ్చిన భైరవద్వీపం సినిమాలో రంగరాజు నటనకు మంచి పేరు వచ్చింది.
తర్వాత ఎక్కువగా విలన్ గా, పలు సినిమాలలో కీలక పాత్రలో నటిస్తూ ఆకట్టుకున్న విజయ రంగరాజు.. మరణంతో టాలీవుడ్ అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. తను నటించిన అన్ని పాత్రల కంటే యజ్ఞం సినిమాలోని పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. గోపీచంద్ యజ్ఞం సినిమాల్లో.. విలన్ గా ఆయన తన నటనతో జీవించేసాడు. ప్రస్తుతం ఈయన చనిపోయిన వార్త వైరల్ అవ్వడంతో ఎంతో మంది ప్రేక్షకులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.