సంక్రాంతి తెలుగు సినిమాల సందడి పూర్తయింది. జనవరి 10న రాంచరణ్ గేమ్ ఛేంజర్, జనవరి 12న నందమూరి బాలయ్య డాకు మహారాజ్, జనవరి 14న విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ అయ్యాయి. అన్ని సినిమాల కంటే చివరిగా వెంకీ మామ సినిమా రిలీజ్ అయినా.. ముందు రిలీజ్ అయిన రెండు సినిమాల కంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుని సంక్రాంతి 2025 విన్నర్ గా నిలిచే దిశగా దూసుకుపోతుంది. ఇంకా ఈ సినిమా రిలీజ్‌కి ముందే అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్స్ పడ్డాయి. అంటే సినిమాకు రిలీజ్ ముందే ఏ రేంజ్ లో హైపర్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు.
ఇక మూవీ రిలీజై ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా మంచి టాక్ రావడంతో జనవరి 15న కూడా సంక్రాంతికి వస్తున్నాం మూవీకి మంచి బుకింగ్ ఏర్పడ్డాయి. సాధారణంగా వెంకటేష్ నటించిన సినిమాల్లో.. ఆయనకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎఫ్2 మూవీలోను యంగ్ హీరో వరుణ్ తేజ్‌ని పూర్తిగా డామినేట్ చేశాడు వెంకీ మామ. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మాత్రం వెంకటేష్ కంటే ఎక్కువగా ఆయననే డామినేట్ చేస్తూ బుల్లి రాజుగా నటించిన బుడ్డోడు ప్రేక్షకులను మెప్పించాడు. పూర్తిగా మిగతా నటులను డామినేట్ చేసిన ఆ బుడ్డోడు సీన్స్‌కి థియేటర్లంతా నవ్వుల వర్షం కురిసింది. ఇంతకీ ఎవరి బుల్లి రాజు.. ఆ బ్యాగ్రౌండ్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
బుల్లి రాజుగా నటించిన ఈ కుర్రాడు పేరే భీమలా రేవంత్ పవన్ సాయి సుభాష్. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత ఈ బుడ్డోడి టాలెంట్ కు టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు రావడం ఖాయం అంటూ ఇప్పటికే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాస్టర్ భరత్ తర్వాత ఈ రేంజ్‌లో నవ్వించగలిగిన చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు రేవంత్. భరత్ ప్లేస్‌ను రీప్లేస్ చేయగల బుల్లి కమెడియన్గా రేవంత్‌కు మంచి పేరు వచ్చింది. తనలోని టాలెంట్‌ను తెలుసుకుని ఈ రేంజ్ లో బుల్లి రాజుగా రేవంత్‌తో కామెడీ పండించిన అనిల్ రావిపూడి పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు జనం. ఇక సంక్రాంతికి వస్తున్నాం తో వెంకీకి హ్యాట్రిక్ ఇచ్చిన దర్శకుడుగా అనిల్ రావిపూడి రేర్ ఫీట్ సాధించాడు. తన తర్వాత సినిమాను మెగాస్టార్ చిరుతో చేయబోతున్నాడు. అనిల్ ఈ సినిమాల్లో కూడా బుల్లి రాజు రేవంత్‌కి ఒక మంచి రోల్ ఉన్నట్లు సమాచారం.