ప్రస్తుతం నందమూరి నటసింహం బాలయ్యకు గుడ్ టైం నడుస్తుందనటంలో సందేహం లేదు. ప్రస్తుతానికి మంచి జోష్‌తో దూసుకుపోతున్నాడు బాలయ్య. కెరీర్‌లో పీక్ స్టేజ్ అంటే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాల టైమ్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఆ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకోకున్న.. బాక్సాఫీస్ దగ్గర వరుస బ్లాక్ బస్టర్‌లతో రాణిస్తున్నాడు. అలా.. ప్రస్తుతం ఉన్న సీనియర్ స్టార్ హీరోల్లో వరుసగా నాలుగు హిట్లు కొట్టడం బాలయ్యకు మాత్రమే సాధ్యమైన రేర్ ఫీట్ అనడంలో సందేహం లేదు. అఖండతో మొదలైన బాలయ్య ఆఖండ విజయం.. తాజాగా రిలీజ్ అయిన డాకు మహారాజ్ విషయంలోనూ ఇప్పటికీ కొనసాగుతుందని క్లియర్ గా తెలుస్తుంది.
నేడు రిలీజ్ అయిన ఈ సినిమాకు ఇప్పటికే దాదాపు అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. సెకండ్ హాఫ్ కొంత స్లోగా అనిపించినా.. ఓవరాల్ గా అయితే సినిమాను ఎంజాయ్ చేసామని అభిమానులు చెప్తున్నారు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజు ఇలా వరుసగా నాలుగు హిట్ల అందుకున్న బాలయ్య సినిమాలు.. కొన్నేళ్ళక్రితం కేవలం ట్రాలింగ్ స్టఫ్‌గా మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యేవి. అలా సింహ కంటే ముందు నటించిన ఎన్నో సినిమాలతో బాలయ్య ట్రోలింగ్‌కు గురైన సంగతి తెలిసిందే. అయితే సింహాతో మెరుగుపడిన బాలయ్య పరిస్థితి.. అఖండ తర్వాత మరింత మార్పు పుంజుకుంది.
బాలయ్యలో ఇంత మార్పుకి కారణమేవరు.. ఇలా వరుస హిట్లతో ఫుల్ జోష్ మీద దూసుకుపోవడానికి కారణమేంటి.. అనే సందేహాలు అందరిలోనూ ఉంటాయి. అయితే.. గతంలో బాలయ్య డైరెక్టర్లను గుడ్డిగా నమ్మేసేవాడు. కానీ.. అఖండ నుంచి బాలయ్య దర్శకులను జాగ్రత్తగా ఎంచుకోవడం మొదలుపెట్టాడు. బాలయ్యలో వచ్చిన ప్రధాన మార్పు ఇదే అని.. కథల పరంగా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండేలా చూసుకుంటూ.. తీసుకుంటున్న జాగ్రత్తల కారణంగా సక్సెస్ అవుతున్నారని తెలుస్తుంది. భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాల్లో బాలయ్య తానే స్వయంగా కొన్ని ఐడియాలను కూడా ఇచ్చారట. ఫ్యాన్స్ తనని ఎలా చూడాలనుకున్నారో అది తనతో సినిమా తీయబోయే దర్శకుడికి ముందుగానే వివరిస్తున్నాడని తెలుస్తోంది.
ఇక ఆయనల్లో వచ్చిన మరో అతిపెద్ద మార్పు ట్రెండ్ కు తగ్గట్టుగా యంగ్ డైరెక్టర్లను ఎంచుకుంటున్నాడు. అంతే కాదు అవుట్‌డేటెడ్ డైరెక్టర్లను పక్కన పెట్టేసి.. తన బాడీ లాంగ్వేజ్‌ని పూర్తిగా అర్థం చేసుకున్న బోయపాటికే ఇంపార్టెన్స్ ఇస్తూ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే గోపీచంద్ మలినేన్ని, అనిల్ రావిపూడి, బాబీ లాంటి యంగ్ డైరెక్టర్లను ఎంచుకుంటూ రాణిస్తున్నాడు. తను ఎంచుకునే కథల విషయంలో చిన్న కూతురు తేజస్విని అభిప్రాయాలను కూడా తీసుకుంటున్నాడు. అలా తేజస్విని ఇప్పుడు తన తండ్రి నటిస్తున్న సినిమాల ఎంపిక, ఇతర విషయాలను దగ్గర ఉండి చూసుకుంటున్నారట. ఇది కూడా బాలయ్య సినిమాల సక్సెస్ కు కారణం అని తెలుస్తుంది.