టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలయ్యకు ప్రస్తుతం గుడ్ టైం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ టాక్‌తో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బాలయ్య అఖండ సినిమా కంటే ముందు నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్‌గా నిలిచేవి. ట్రోలర్స్ కు స్టఫ్ కంటేంట్‌గా ఉండేవి. అయితే ఒక్కసారి అఖండ సినిమాతో బాలయ్య జాతకం యు టర్న్ తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ ఐదేళ్లలో బాలయ్య రెమ్యూనరేషన్ ఐదు రెట్లు పెంచుకుంటూ వచ్చారు. అఖండ తర్వాత బాలయ్య.. వీర సింహారెడ్డి సినిమాకు రూ.12 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోగా.. భగవంత్ కేసరి సినిమాకు రూ.18 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నాడట.
ఇక తాజాగా వచ్చిన డాకు మహారాజ్ సినిమాకు రూ.27 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇక అఖండ 2 సినిమా కోసం బాలయ్య ఏకంగా రూ.35 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడట. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో బాలయ్య మరో సినిమా నటించనున్నాడు. ఈ సినిమాకు ఏకంగా బాలయ్య రూ.40 కోట్ల రెమ్యూనరేషన్ను ఛార్జ్ చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. ఇలా ఐదేళ్లలో బాలయ్య రెమ్యూనరేషన్ ఐదు రెట్లు పెరిగిపోయింది అంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు వైరల్ అవుతున్నాయి. సీనియర్ హీరోల్లో చిరంజీవి తర్వాత ఈ రేంజ్‌లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరో బాలయ్య. డాకు మహారాజ్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే రూ.130 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి దూసుకుపోతుంది. బాలయ్య తర్వాత సినిమాలతో బాక్సాఫీస్ షేక్ చేయాలని ఫ్యాన్స్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రోజురోజుకు బాలయ్య క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే వాళ్ళ నుంచి నెక్స్ట్ రాబోతున్న ప్రాజెక్టులపై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇక బాలయ్య కూడా ఇదే స్వింగ్‌ను కొనసాగిస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను బిజీబిజీగా ప్లాన్ చేసుకుంటున్నారు బాలయ్య. పాన్ ఇండియా లెవెల్‌లో ఇమేజ్‌ను సంపాదించుకుంటే.. ఈయన క్రేజ్ మరింతగా పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. ఇక బాలయ్య నుంచి నెక్స్ట్ రాబోతున్న అఖండ 2 పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో మాత్రం బాలయ్య పాన్ ఇండియా లెవెల్‌లో బ్లాక్ బస్టర్ అందుకుంటే.. ఆయన మార్కెట్ మరింతగా పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. ఈ సినిమాతో బాలయ్యకు బోయపాటి ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో వేచి చూడాలి.