అల్లు అర్జున్‌కు యాంటీగా టాలీవుడ్ క‌మెడియ‌న్ షాకింగ్ కామెంట్స్ ..!

గత కొద్దిరోజులుగా టాలీవుడ్‌లో అల్లు అర్జున్ వివాదం దుమారాం రేపుతుంది. సోషల్ మీడియా, జనరల్ మీడియా అని తేడా లేకుండా.. ఎక్కడ చూసినా ఈ వివాదం పైన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక.. ఇందులో భాగంగా బన్నీ తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటూ ఎన్నో ఇబ్బందులు చెవి చూస్తున్నాడు. అయితే సంధ్య థియేటర్ ఇష్యూలో ఆయన తప్పు ఉందని.. ఇటీవల కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి ఇప్పటికీ జాతీయ స్థాయిలో ఈ వివాదం సంచలనంగా వైరల్ అవుతూనే ఉంది. దీంతో సినీ సెలెబ్రెటీస్ అంతా ఐకాన్ స్టార్‌కు అండగా నిలిచారు. ఇలాంటి క్రమంలో నటుడు రాహుల్ రామకృష్ణ కూడా పోలీసులపై ఫైర్ అయ్యాడు.

Do you think I would be so insensitive?': Allu Arjun's response hours after CM blamed him for Pushpa 2 stampede death | India News - The Indian Express

తాజాగా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ సంచలన‌ కామెంట్లు చేశాడు. అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి దీనిపై వివరణ ఇచ్చాడు. తన తప్పు లేదని ఆయన వివరించాడు. ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైర‌ల్ అవుతూనే ఉన్నాయి. నెటిజ‌న్లు బన్నీని తెగ ట్రోల్స్ చేస్తూ దారుణంగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఓ సంచలన ట్విట్ షేర్ చేయడం వైరల్ గా మారుతుంది. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన క్రమంలో.. ఆయనకు సపోర్ట్ గా మాట్లాడిన రాహుల్ రామకృష్ణ.. ఇప్పుడు తాను చెప్పిన మాటలను వెనక్కి తీసుకుంటున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Actor-comedian Rahul Ramakrishna quits film industry: I will not do films anymore | Telugu Movie News - Times of India

జరిగిన సంఘటనపై నాకు చాలా తప్పుడు సమాచారం వచ్చిందని.. అందుకే నేను చేసిన కామెంట్లను వెనక్కి తీసుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అప్పుడు అల్లు అర్జున్‌కు సపోర్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశాడు. కానీ.. ఇప్పుడు సడన్గా ఇలా పార్టీ మార్చేయడంతో చాలామంది నెటిజ‌న్స్ ఆశ్చర్యపోతున్నారు. కొందరు మాత్రం.. ఇండస్ట్రీ వైపు కాకుండా న్యాయం వైపు సపోర్ట్ గా రాహుల్ రామకృష్ణ మాట్లాడుతున్నాడు. నిజంగా అతను గ్రేట్ అంటూ.. అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన పోస్ట్ అల్లు అర్జున్‌కు యాంటీగా ఉండడంతో.. నెటింట‌ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది.