తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో.. రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్లుగా మాటల వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ ఏసీపీ విష్ణుమూర్తి.. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై రియాక్ట్ ఆయన పై ఫైర్ అయ్యాడు. ఆయన.. అల్లు అర్జున్ ను ఉద్దేశిస్తూ ఘాటు విమర్శలు చేశాడు. ఇక ఏసిసి విమర్శలు చేసిన కొద్ది సమయానికి అల్లు అర్జున్ తన ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారుతుంది. బన్నీ.. తన అభిమానుల కోసం ఎక్స్ ద్వారా ఒక మెసేజ్ షేర్ చేసుకున్నాడు.
తమ అభిప్రాయాలను అభిమానులు బాధ్యతాయుతంగా అందరికీ తెలియజేయాలని.. ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టవద్దంటూ వెల్లడించాడు. నా ఫ్యాన్స్ ముసుగులో కొంతమంది గత కొద్ది రోజులుగా ఫేక్ ప్రొఫైల్స్ తో.. ఫేక్ ఐడీలతో పోస్టులు పెడుతున్నారని.. వారందరిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా వెల్లడించాడు. నెగటివ్ పోస్టులు పెడుతున్న వారికి తమ అభిమానులు దూరంగా ఉండాలంటూ కోరాడు.
ఆన్ లైన్‌లోనే కాదు.. ఆఫ్ లైన్ లోనూ ఎవరిపైన దుష్ప్రచారాలకు దిగవద్దని రిక్వెస్ట్ చేస్తూ అభిమానులకు ట్విట్ చేశాడు. కాగా నిన్న మధ్యాహ్నం చిక్కడపల్లి ఏసీపీ విష్ణుమూర్తి ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సంచల కామెంట్లు చేయగా.. ఈ మీట్ తర్వాత అల్లు అర్జున్ కొద్దిసేపటికి పెట్టిన మొదటి ట్విట్ ఇదే కావడంతో ఈ ట్వీట్ నెటింట వైరల్‌గా మారింది. దీంతో.. ఆయన కామెంట్స్ కు బన్నీ ఈ విధంగా కావాలనే రియాక్ట్ అయ్యాడంటూ మాట్లాడుకుంటున్నారు.