తాజాగా రామ్‌చరణ్.. గేమ్ ఛేంజర్ మూవీ ప్రమోషన్స్ కోసం సుకుమార్, బుచ్చిబాబు కూడా డల్లాస్ చేరుకుని సందడి చేశారు. బుచ్చిబాబు, సుకుమార్ రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ ఎన్నో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్ ఎంట్రీ అదరగొట్టేసాడు. ఎంట్రీ తోనే అక్కడ ఆడియన్స్‌లో కొత్త వైబ్ మొదలైంది. ఈవెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు వచ్చిన క్రౌడ్, స్టేడియం , దిల్ రాజు, శంకర్, సుకుమార్.. స్పీచ్ లు నెట్టింట తెగ వైరల్ గా మారుతున్నాయి. చరణ్ మాట్లాడుతూ.. తన టీం గురించి ఎంతో గొప్పగా వివరించాడు. గేమ్ ఛేంజర్ మూవీ సరికొత్త అనుభూతిని ఇస్తుందని.. కచ్చితంగా సినిమాను ఎంజాయ్ చేస్తారంటూ చెప్పాడు. చరణ్ ఈ ఈవెంట్‌లో పుష్ప 2 గురించి కూడా రియాక్ట్ అయ్యాడు.
చిరంజీవి, పవన్ కళ్యాణ్ ప్రస్తావని తీసుకువచ్చి మరీ.. గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్‌లో మాట్లాడిన చరణ్.. అల్లు అర్జున్ పేరు మాత్రం ప్రస్తావించలేదు. సుకుమార్ గురించి మాత్రమే చెబుతూ.. పుష్ప 2ను ప్రశంసించాడు. పుష్ప 2 పెద్ద సక్సెస్ సాధించిందని.. సుకుమార్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుకున్నాడు అంటూ వెల్లడించాడు. ఇక సుకుమార్ మాట్లాడుతూ రంగస్థలం సినిమాకి.. చరణ్‌ఖు జాతీయ అవార్డు వస్తుందని అనుకున్నాను. కానీ.. గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ చూస్తే కచ్చితంగా ఈసారి నేషనల్ అవార్డ్ పక్క అంటూ వెల్లడించాడు. గేమ్ ఛేంజర్ మూవీ గురించి సుకుమార్ పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు. ఇక.. పుష్ప మూవీ కి రియాక్ట్ అయిన రేంజ్‌లో మెగా హీరోస్ పుష్ప 2 గురించి.. ఎప్పటి వరకు స్పందించలేదు.
చిరు వద్దకి.. సుకుమార్, మైత్రి మేకర్స్ వెళ్లారు, కలిసారు కానీ.. చిరంజీవి మాత్రం అప్పటికి పుష్ప 2 చూడలేదు. ఇప్పటికీ చూశాడా.. లేదో.. కూడా క్లారిటీ లేదు. అల్లు అర్జున్ మూవీ సక్సెస్ అయినందుకు మెగా హీరోలు ఇప్పటివరకు గతంలో లాగా ఒక్కరు కూడా స్పందించలేదు. ఇక సినిమా భారీ సక్సెస్ అందుకున్న క్రమంలో ఒక పోస్ట్ పెట్టింది కూడా లేదు. కనీసం సినిమా గురించి ఎక్కడ చర్చించలేదు. చరణ్ అయితే పుష్ప 2 గురించి మాట్లాడుతూ సుకుమార్‌ను పొగడ్తలతో ముంచేశాడు. కానీ.. అల్లు అర్జున్ పేరు కూడా ఎత్తలేదు. ఇక బుచ్చిబాబు ప్రాజెక్ట్ తర్వాత చరణ్ మరోసారి సుకుమార్ తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చరణ్ కామెంట్స్ వైరల్ అవ్వడంతో.. చరణ్ ఈగో హర్ట్ అయినట్టు ఉంది.. అందుకే పుష్ప 2 పై రియాక్ట్ అయిన అల్లు అర్జున్ గురించి మాటైనా చెప్పలేదు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.