శ్రీ తేజ కోసం అల్లు అర్జున్ కీలక నిర్ణయం.. రూ.2 కోట్లతో ట్రస్ట్..

పుష్ప 2 ప్రీవియర్స్ సంధ్య థియేటర్ ఇష్యూలో రేవతి అనే మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమె కొడుకు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేయ‌డం.. దీంతో పాటు జ‌నంలో అల్లు అర్జున్ పై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. మహిళా చనిపోవడానికి, ఆ అబ్బాయి పరిస్థితికి అల్లు అర్జున్ నిర్ల‌క్ష్యం కారణమంటూ.. రోడ్ షోలు అవసరమా అంటూ మండిపడుతున్నారు. దానికి తగ్గట్టుగా అర్జున్ వివాదంలో సీఎం రేవంత్ రెడ్డి అజ్యం పోసిన‌ట్లు ఘాటు విమ‌ర్శ‌లు చేశాడు.

Pushpa 2 stampede: Allu Arjun calls death 'unfortunate,' cites  misunderstandings

సినిమా చూడడానికి పర్మిషన్ ఇవ్వకుండా వెళ్ళాడని.. పైగా రోడ్ షో చేస్తూ గందరగోవడానికి కారణమయ్యాడని.. ఆ మహిళ చావుకు అల్లు అర్జున్ నిర్లక్ష్యమే కారణమని.. ఆయనను అరెస్ట్ చేస్తే ఇండస్ట్రీ మొత్తం తరలి వెళ్లారు.. ఇక మహిళ, బాబు కుటుంబాన్ని ఒకరైన పరామర్శించారీ అంటూ మండిపడ్డాడు. తనపై అన్ని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. నేను ఎలాంటి రోడ్ షో చేయలేదని.. తప్పక ఫ్యాన్స్ కు కనిపించాల్సి వచ్చిందని పర్మిషన్స్ తోనే నేను థియేటర్కు వెళ్లాను అంటూ.. వెంట‌నే అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ క్లారిటీ ఇచ్చాడు.

Pushpa 2: The Rule: సంధ్య థియేటర్లో సృహ కోల్పోయిన బాలుడు పుష్ప డ్యాన్స్  వీడియో ఇదిగో, అల్లు అర్జున్ ఫ్యాన్ శ్రీతేజ వేసిన స్టెప్స్ నెట్టింట వైరల్ ...

అంతేకాదు.. తనకు కూడా ఓ కొడుకు ఉన్నాడని.. శ్రీ తేజ కూడా అలాంటి అబ్బాయి. నేను అతని గురించి ఎంతగానో ఆలోచించా. లీగల్ ఇష్యుల కారణంగా ఆ కుటుంబాన్ని కలవలేకపోయా అంటూ వెల్లడించాడు. ఇలాంటి క్రమంలో శ్రీ తేజ విషయంలో అల్లు అర్జున్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జు..న్ శ్రీ తేజ పేరట ట్రస్ట్ ఏర్పాటు చేయబోతున్నాడట. బన్నీవాస్‌, సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ తో బ‌న్నీ కలిసి.. దాదాపు రెండు కోట్లను ట్రస్ట్ లో జమ చేస్తారని.. ఈ మొత్తాన్ని శ్రీ తేజ వైద్యం, భవిష్యత్తు కోసం ఖర్చు చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.