నందమూరి బాబాయ్.. బాలయ్య, అబ్బాయి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ల మధ్య మొదట్లో ఎలాంటి బాండింగ్ ఉండేదో అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్‌లో ఎదగడానికి బాలయ్య ఎంతగానో ప్రోత్సహిస్తూ వచ్చారు. కానీ.. కొన్ని అనుకోని కారణాలతో బాబాయ్, కొడుకుల మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఆ గ్యాప్ ని వైసిపి నాయకులు వాడుకోవడానికి ఇప్పటివరకు ప్రయత్నిస్తూనే ఉంటున్నారు. ఇలాంటి క్రమంలో బాలయ్య బాబాయ్ కి ఎన్టీఆర్ దగ్గరవుతున్నాడు అంటూ న్యూస్ వైరల్ గా మారుతుంది. నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్‌కు మధ్య ఉన్న దూరం.. మెల్లమెల్లగా దగ్గరవుతుందని.. అనుష్టాప్పబుల్ షోకు ఎన్టీఆర్ రావడం దాదాపు ఫిక్స్ అయిపోయిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇప్పటివరకు చిరంజీవి, ఎన్టీఆర్ రాకపై అనుష్టాపబుల్ విషయంలో.. ఎన్నో అనుమానాలు, అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆ రెండింటిని కొత్త షోతో బాలయ్య క్లియర్ చేయబోతున్నాడట. అయితే ఇప్పుడు ఇంత ఖచ్చితంగా ఆ వార్త వైరల్ అవ్వడానికి కారణం క్యూస్షన్ పేపర్ లీక్ అవ్వడమే. ఏ హీరో అయినా షో కి రాబోతున్నారు అంటే.. ముందే అయనకు సంభందించిన క్వశ్చన్ పేపర్ రెడీ అయిపోతుంది. అదే జరిగింది. అందుకే తారక్ రావడం ఆల్మోస్ట్ కన్ఫామ్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎలా అయితే అల్లు అర్జున్, చిరంజీవిల మధ్య గ్యాప్ ను దూరం చేయడానికి బన్నీ.. చిరు ఇంటికి వెళ్ళాడో.. అలాగే ఇప్పుడు బాబాయ్ షోకి ఎన్టీఆర్ వెళ్ళబోతున్నాడట.
ఇక గతంలో ఈ షో లో పవన్ – బాలయ్య ఎపిసోడ్ బాగా హైలెట్గా నిలిచింది. అలాగే ప్రభాస్‌తో కూడా షో పీక్స్ లెవెల్‌కి వెళ్ళింది. ఇండియాలోనే అరుదైన షోలలో అన్‌స్టాపబుల్ నెంబర్ వన్ గా నిలిచింది. ఇక.. చిరంజీవితో బాలయ్య ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు ఉంటుందో అనుకుంటున్నా క్రమంలో ఈ ఎపిసోడ్‌కి ఎన్టీఆర్ పేరు రావడం హైలెట్ గా మారింది. నిజంగానే న్యూ సీజన్లో ఎన్టీఆర్.. బాలయ్య షోకి హాజరయ్యే అవకాశం ఉందట. ఎందుకంటే ఎన్టీఆర్ షో కోసం.. ప్రశ్నలు, ఇంట్రడక్షన్ సీన్స్ ఇలా అన్నింటి స్క్రిప్ట్ పేపర్ రెడీ అయిపోయిందని.. ఈ పేపర్ లీక్ అవడంతోనే అన్‌స్టాపబుల్ వచ్చే కొత్త సీజన్‌లో ఎన్టీఆర్ ఎపిసోడ్ ఉంటుందని మరింత స్ట్రాంగ్ గా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కొత్త సంవత్సరం కొత్త ఎపిసోడ్‌లో బాబాయ్ షోలో అబ్బాయి వస్తున్నాడో.. లేదో.. తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.