సంధ్య థియేటర్ తొకీసులాట మీడియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తొక్కీసులాట ఘటనలో ఓ మహిళ చనిపోవడంతో.. అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి మరి ఆయనను అరెస్ట్ చేశారు పోలీసులు. బెయిల్ పై బయటకు వచ్చిన బన్నీ.. అక్కడ నుంచి వరుస వివాదాలలో చిక్కుకుంటూ ఎన్నో ట్రోల్స్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి క్రమంలో.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలోనే బన్నీ మీడియా సమావేశం నిర్వహించి మరి వీటిపై రియాక్ట్ అయ్యాడు. విమర్శలకు గట్టిగా కౌంటర్ వేశాడు. మీడియాతో సంధ్య థియేటర్లో ఏం జరిగిందో వెల్లడించాడు.
ఇలాంటి క్రమంలో బన్నీ బెయిల్ కండిషన్స్ ను క్రాస్ చేసాడని.. బెయిల్ క్యాన్సిల్ చేయాలని పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలా చేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో.. వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. సీఎం కామెంట్లపై అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఎవరి తప్పులేదని.. తొక్కీసులాటలో మహిళా మృతి చెందిన సమాచారం మరుసటి రోజు వరకు నాకు తెలియలేదు అంటూ చెప్పుకొచ్చాడు. దీనిపై హైదరాబాద్ పోలీసులు ఘటన జరిగాక.. ఏ పోలీస్ అధికారి తనతో మాట్లాడలేదన్న అల్లు అర్జున్ వ్యాఖ్యలపై పూర్తి ఆధారాలు, వీడియోలతో సహా మ్యాటర్‌ను రివీల్ చేశారు. అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు.
బెయిల్ కండిషన్స్‌ను బ్రేక్ చేసి.. కేస్ ఇన్వెస్టిగేషన్ పై ప్రభావం చూపే విధంగా అల్లు అర్జున్ మాట్లాడాడని.. వెంటనే ఆయన బెయిల్ ను క్యాన్సిల్ చేయాలని కోరుతూ ఈరోజు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి రెడీ అవుతున్నారు పోలీసులు. వాస్తవంగా అల్లు అర్జున్ కు వచ్చేనెల 21 వరకు మధ్యంతర బెయిల్ వచ్చింది. విచారణ విషయంలో పోలీసులకు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న బన్నీ హైకోర్టు ఆదేశాలతో రిలీజ్ అయిన కేసుకు సంబంధించిన విషయాలు బయట మాట్లాడకూడదని ఎంతో మంది.. న్యాయ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సల్ అవుతుందో.. లేదో.. అనే సందేహం జనంలో మొదలైంది. ఇక ముందు ముందు కేస్ మరెని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.