టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల పరంగా ఎలాంటి సక్సెస్ అందుకుంటున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న మహేష్.. 5 పదుల వయసు దగ్గర పడుతున్నా ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ఫిట్నెస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తన అభినయంతో మెప్పిస్తున్నాడు. ఇక త్వరలోనే దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ బాబు ఓ పాన్ వరల్డ్ మూవీలో నటించనున్నాడు. కాగా.. ఇప్పటివరకు తన సినీ కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించిన మహేష్ బాబు.. కొన్ని డిజాస్టర్ సినిమాల్లోనూ నటించాడు. కానీ.. ఆయన నటించిన ఒక్క డిజాస్టర్ మూవీ గురించి మాత్రం మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశాడు.
నేను.. ఆ సినిమాలో నటించి పెద్ద తప్పు చేశానని.. అలాంటి సినిమా ఇక జీవితంలో చేయనంటూ తేల్చి చెప్పేసాడు. ఇంతకీ మహేష్ బాబు అంత దారుణంగా కామెంట్స్ చేసిన డిజాస్టర్ మూవీ ఏంటో.. అసలు ఎందుకు అలా కామెంట్స్ చేశారో.. ఒకసారి చూద్దాం. ఓ ఇంటర్వ్యూలో మహేష్ మాట్లాడుతూ.. సినిమా బాగుంటే ఆడియన్స్ నుంచి మంచి కోపరేషన్ వస్తుంది. బాగా లేకపోతే త్వరగా వాళ్లే సినిమాలు చంపేస్తారు. ఈ రెండింటికి సిద్ధంగా ఉండే సినిమాలు తీస్తా. అయితే బ్రహ్మోత్సవం లాంటి సినిమా చేస్తే మాత్రం.. ఫ్యాన్స్‌కు నేను సమాధానం చెప్పుకోలేను. ఎందుకంటే అది కంప్లీట్ గా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా. అసలు సరిగ్గా వర్కౌట్ కాలేదు.
ఆ స్క్రిప్ట్ ని సెలెక్ట్ చేయడం నేను నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అంటూ మహేష్ బాబు చెప్పుకొచ్చాడు. అసలు ఆ కథని ఎందుకు ఎంచుకున్నాను అని బాధపడుతున్నా. ఇకపై అలాంటి తప్పు ఎప్పటికీ రిపీట్ చేయను అంటూ మహేష్ బాబు షాకింగ్ కామెంట్ చేశారు. బ్రహ్మోత్సవం నా అభిమానులకే కాదు.. సాధారణ ఆడియన్స్‌కు కూడా నచ్చలేదని చెప్పినా ఆయన.. విచిత్రం ఏంటంటే ప్లాప్ సినిమా పడిన తర్వాత నా సినిమా మార్కెట్ మారింతగా పెరుగుతుంది. బ్రహ్మోత్సవం తర్వాత స్పైడర్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ కెరీర్‌లో హైయెస్ట్ బిజినెస్ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ కొన్ని కథలు నాకు నచ్చిన ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని అసలు నటించలేకపోతున్న అంటూ వెల్లడించాడు. ప్రస్తుతం మహేష్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.