మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కనున్న తాజా మూవీ గేమ్ ఛేంజర్. వచ్చే నెల 10వ తారీకున సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను నెలకొల్పాయి. ఆడియన్స్ ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అంటూ కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈనెల 21 తారీకు నుంచి మూవీ ప్రమోషన్స్‌లో టీమ్ సందడి చేయనున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారి అమెరికా డల్లాస్ ప్రాంతంలో.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్న మొట్టమొదటి సినిమాగా గేమ్ ఛేంజర్ సరికొత్త చరిత్ర సృష్టించనుంది.
తర్వాత ఇండియాకి వచ్చి ఇక్కడ పలు ప్రీ రిలీజ్ ఈవెంట్లను అన్ని రాష్ట్రాల్లో గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ తాజాగా ఓవర్సీస్‌లో ప్రారంభమయ్యాయి. నార్త్ అమెరికాలో మూడు రోజుల క్రితం బుకింగ్స్ ఓపెన్ కాగా.. 1000 షోస్ నుంచి రెండు లక్షల 50 వేల డాలర్స్ గ్రాస్ వసూళు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం కల్కి , పుష్ప 2 రేంజ్ లోనే అడ్వాన్స్ బుకింగ్ జరుగుతునట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇదే ఊపు కొనసాగిస్తూ ముందుకు పోతే.. కచ్చితంగా సినిమా నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోస్ నుంచి మూడు మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ కొల్లగొట్టడం ఖాయమని ఫాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
నిన్నటి నుంచి తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే నార్త్ అమెరికా రాష్ట్రాల్లో XD షోస్ ని షెడ్యూల్ చేస్తూ వస్తున్నారు మేకర్స్.. XD షోస్ కి అక్కడ ఉండే మన ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి చెబుతున్నట్లు తెలుస్తుంది. ఆ షోస్ నుంచి సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ రానుందని అంటున్నారు. ఈ సినిమా ఆల్ టైం రికార్డ్ రాబట్టాలంటే.. నాలుగు మిలియన్ డాలర్లకు గ్రాస్ అమెరికా నుంచి రావాల్సి ఉంది. కల్కి సినిమాకు 3.9 మిలియన్ డాలర్లకు గ్రాస్ రాగా.. ప్రస్తుతానికి ఓవర్సీస్ లోని అన్ని దేశాలకు కలిపి 3 లక్షల 50 వేల డాలర్లు గేమ్ ఛేంజర్ కొల్లగొట్టినట్లు సమాచారం. 21వ తేదీన చరణ్.. నార్త్ అమెరికాలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొని సందడి చేయనున్నారు. తర్వాత ఈ గ్రాస్ వసుళ్ళు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక ఈ సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్ ప్లస్ మొదటి రోజు కల్కి పుష్ప 2 గ్రాస్ వసూళను కొల్లగొడుతుందా లేదా వేచి చూడాలి.