బాగా తగ్గిన పుష్ప.. సీఎం ఎంట్రీతో సీన్ మారిపోయిందే..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప 2తో రికార్డులు బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. తగ్గేదెలే అంటూ కలెక్షన్ల‌ వర్షం కురిపించిన ఈ సినిమా ప్రీమియర్స్ క్ర‌మంలో బ‌న్నీ సంధ్య థియేటర్ ఇష్యూలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. బ‌న్నీ బెయిల్‌, సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు, త‌ర్వ‌త బ‌న్నీ ప్రెస్ మీట్, వెంట‌నే పోలీసులు ప్రూఫ్‌లతో సహా వీడియోలు రియల్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టడం, అల్లు అర్జున్‌ను మ‌రోసారి విచారణకు పిలవడం.. ఇవన్నీ మీడియాలో హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే తగ్గేదెలా అంటూ సినిమాల్లో పవర్ ఫుల్ డైలాగ్ చెప్పిన పుష్పారాజ్‌.. రియల్ లైఫ్ లో మెట్టు దిగాడు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన రియాక్ట్ అవుతూ శ్రీ తేజ కుటుంబానికి అండగా ఉండి.. భారీ అమౌంట్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ చేస్తామంటూ వెళ్లడించాడు. ఈ క్రమంలోనే.. బన్నీ తరఫున ఆయన తండ్రి అల్లు అరవింద్‌తో పాటు.. సినిమా ప్రొడ్యూసర్లు కూడా శ్రీ తేజ కుటుంబాన్ని పరామ‌ర్శించేందుకు వెళ్లారు. ఇక శ్రీ తేజ తండ్రికి అల్లు అరవింద్ కోటి రూపాయలు, సుకుమార్ నుంచి రూ.50 లక్షలు నిర్మాతల నుంచి రూ.50 లక్షలు చొప్పున మొత్తం గా రెండు కోట్ల చెక్కులను అందించారు.

Producer Allu Aravind Handed over 2 Crore Cheque to Revathi Family ||  Samayam Telugu

ఆ కుటుంబాని పరామర్శించిన తర్వాత అల్లు అరవింద్ మాట్లాడుతూ శ్రీ‌తేజ హెల్త్ అప్డేట్‌తో పాటు మ‌రిని విష‌యాల‌పై మాట్లాడాడు. నేరుగా తాము డబ్బులు శ్రీ తేజకు అందించకూడదని.. మా లీగల్ టీం వెల్లడించింది. ఈ క్రమంలోనే వారి సలహా మేరకు డబ్బులను చెక్ రూపంలో దిల్ రాజుకు అందించాము. ఆయన కుటుంబానికి డబ్బులు అందేలా చేస్తాడంటూ అల్లు అరవింద్ వెల్లడించాడు. ఇక నేడు.. 10 గంటలకు సినీ పెద్దలంతా కలిసి ఇండస్ట్రీ సమస్యల పై, తాజాగా ఇండస్ట్రీలో జరుగుతున్న సంఘటనపై రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడనున్నారు.