డిస్నీ వరల్డ్ సంస్థ నిర్మించే యానిమేషన్ సినిమాలకు పాన్ వరల్డ్ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే సంస్థ నిర్మించిన తాజా యానిమేటెడ్ మూవీ ” ముఫాసా: ది లయన్ కింగ్ ” . ఇక ముఫాసా రోల్‌కు మహేష్ బాబు డబ్బింగ్ అందించడంతో.. తెలుగు ఆడియన్స్‌లో మరింత క్రేజ్ పెంచింది. అప్పట్లో ది లయన్ కింగ్‌కు నాని డబ్బింగ్ చెప్పడం విశేషం. పిల్లలను టార్గెట్‌గా చేసుకుని రూపొందించిన ఈ సినిమాకు.. బెరి జేన్ కిన్స్ దర్శకుడిగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా.. ఎలాంటి రిజల్ట్ అందుకుంది, ప్రేక్షకులను ఆకట్టుకుందా.. లేదా.. రివ్యూలో తెలుసుకుందాం.
స్టోరీ
లైఫ్ సైకిల్ లో భాగంగా.. సింబా.. నాలా మరో బిడ్డను తన లైఫ్ లోకి ఆహ్వానించడం కోసం అడవుల్లోకి వెళ్లి పోతాడు. ఆ టైంలో అడవికి వెళ్లే ముందు.. తన కూతురు కైరా( బుల్లి సింహం)ను టిమోన్(బుల్లి జంతువు), పుంబా(పంది)కు అప్పజెప్పి జాగ్రత్తగా చూసుకోమని వెళ్తాడు. ఈలోగా వర్షం మొదలయ్యే సూచన వస్తుంది. దాంతో బుల్లి సింహం కైరా.. భయపడిపోతుంది. అప్పుడు రఫిక్ (కొండముచ్చు) వచ్చి.. మీ తాత ముఫాసా ఎంత ధైర్యవంతుడో తెలుసా.. అసలు భయపడేవాడు కాదు.. అని కథ చెప్పడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఆ కైరా నిజమా.. మా తాత గురించి చెప్పు అని అడుగుతుంది. ఆ కొండముచ్చు ..ముఫాసా స్టోరీ చెప్పటం మొదలెడుతుంది. సాధారణమైన ముఫాసా తన ధైర్య సాహసాలతో ఎలా అడవికి రాజు అయ్యాడు..? చిన్నప్పుడే తల్లి తండ్రి నుంచి విడిపోయి ఎలా..? తను లైఫ్ను కొనసాగించాడు. తన సోదరుడికి స్కార్ అనే పేరు ఎలా..? వచ్చింది. అసలు అతను మొఫాసాకు సొంత బ్రదరేనా..?. వీళ్ళిద్దరి మధ్య వైరం ఏంటి..? ముఫాసా టీనేజ్ లవ్ స్టోరీ ఏ మలుపు తిరిగింది..? ఇలాంటి విషయాలు సినిమాలో చూపించారు.
విశ్లేషణ:
వరదల్లో చెల్లాచెదరైన కుటుంబం.. హీరో ఒంటరివాడు కావడం.. తన కుటుంబం కోసం వెతుకులాట.. వేరే కుటుంబంతో కలిసి పెరగడం.. పెద్ద అవడం.. బ్రదర్స్ మధ్య వార్.. ఈ విషయాలతో ఎన్నో సినిమాలు తెలుగుతోపాటు చాలా భాషల్లో బచ్చి సక్సెస్ సాధించాయి. అయితే ఇంత కాలానికి మళ్లీ ఇదే కథ.. కాస్తంత యాక్షన్ కలిపి.. యానిమేషన్ గా.. చానిమల్స్‌తో నడుపుతూ.. మోపాసాగా తెరకెక్కించారు. ప్రేక్షకులను ఆకట్టుకున్నా.. కొన్నిసార్లు బాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ వస్తుంది. సినిమాకు పిల్లలు కనెక్ట్ అవ్వడం కష్టమే. మనుషుల్లో తెల్లజాతి, నల్లజాతి వారు లాగా.. జంతువుల్లోనూ తెల్ల సింహాల డామినేషన్ నల్ల సింహాలు మొత్తం ఏకమై వాటిపై పోరాడడం చూపించారు. ఆఫ్రికా అడవుల్లో ఈ కథ జరిగింది. సినిమా విజువల్స్ ఆకట్టుకుంటాయి. టెక్నికల్గా మెప్పించినా.. స్టోరీ లేదనిపించింది.
లయన్ కింగ్ సినిమా చూసినవారికి అందులో స్కార్.. బ్యాక్ స్టోరీ అర్థమవుతుంది. ఇక ముఫాసా గురించి తెలుసుకోవాలంటే.. ఈ సినిమా చూడాలి. ఇక ముఫాసా బ్యాక్ స్టోరీ చెప్పడానికి మరింత వెనక్కు వెళ్లి మరి కథ వినిపించారు. అంతకుమించి సినిమాలో పెద్ద స్టోరీ ఏం లేదు. ఇక టెక్నికల్గా సినిమా చాలా హైలెట్ గా అనిపించింది. లైవ్ యానిమేషన్ సినిమాకు నాచురల్‌గా అనిపిస్తుంది. మహేష్ బాబు డబ్బింగ్ లో ముఫాసా పాత్ర తాలూకు ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా పడ్డాయి. ఈ రోల్‌లో ఉన్న స్ట్రగుల్స్, పెయిన్స్, ఆడియన్స్ కు కనెక్ట్ అవుతాయి. పుంబాగా (బ్రహ్మానందం) చెప్పిన డబ్బింగ్.. టీమోన్ (అలీ) చెప్పిన డబ్బింగ్ సరైన కామెడీ సింక్ అవుతూ పర్ఫెక్ట్ గా అనిపించాయి. పిట్ట గొంతుకు (షేకింగ్ శేషు) వాయిస్ పర్ఫెక్ట్. ఇక టాకా క్యారెక్టర్ కు సత్యదేవ్ వాయిస్, వైట్ లయన్ కు అయ్యప్ప శర్మ వాయిస్ ఇచ్చాడు. రఫీకి క్యారెక్టర్ కి ఆర్ సి ఎం రాజు వాయిస్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇక సినిమాను మహేష్ కోసం కాకుండా.. మంచి యానిమేషన్ సినిమా చూడాలనుకునేవారు ఎంజాయ్ చేయవచ్చు. స్టోరీ పరంగా ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే బెస్ట్.
రేటింగ్ : 2.5/5