సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోస్‌గా తమను తాము ఎస్టాబ్లిష్ చేసుకోవాలని.. తమకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకోవాలని ఆరాటపడుతుంటారు. దానికోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. అలాంటివారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉంటారు. తనదైన నటనతో సత్తా చాటుకుని సూపర్ స్టార్‌గా క్రేజ్ సంపాదించుకున్న మహేష్ బాబు.. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో ఓ పాన్ వరల్డ్ సినిమా నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. కాగా జక్కన్న డైరెక్షన్‌లో సినిమా కావడంతో.. ఇప్పటికే ఈ సినిమా పై పాన్ ఇండియా లెవెల్లో అభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమా ఎలాగైనా సూపర్ సక్సెస్ సాధిస్తే చూడాలని మహేష్ ఫ్యాన్స్ కూడా ఆరాటపడుతున్నారు. అయితే సినిమా విషయంలో రాజమౌళి, మహేష్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తుంది. ఇక మహేష్ తన ఫిట్నెస్, మేకోవర్ కోసమే ఇప్పటికీ చాలా ఖర్చు చేశాడట. అయితే ఇప్పటికే మహేష్ బాబు చాలా వరకు సినిమాపై టైమ్ కూడా స్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన రెమ్యూనరేషన్ విషయం నెటింట హాట్ టాపిక్‌గా మారింది. సినిమా కోసం మహేష్ రెమ్యూనరేషన్‌ను ఎక్కువగా డిమాండ్ చేశాడని టాక్ నడుస్తుంది.
ఇప్పటికే సంవత్సరం నుంచి ఆయన ఎన్నో యాడ్స్, సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో.. మహేష్ దాదాపు మూడు సంవత్సరాలకు సరిపడా రెమ్యునరేషన్ తీసుకోనున్నాడట. దీంతో ప్రొడ్యూసర్ దగ్గర భారీ రేంజ్‌లో డబ్బులు వసూళ్లు చేస్తున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక.. మహేష్ ఈ సినిమా కోసం ఏకంగా రూ.200 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా 2025 జనవరిలో ప్రారంభం కానుంది. రెండు సంవత్సరాల పాటు సినిమా సెట్స్‌పై ఉండనుందన్ని.. 2027 ఎండింగ్‌కి సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్.