మెగాస్టార్‌ని భేటీకి రావద్దని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారా.. కారణం తెలిస్తే మైండ్ బ్లాకే.. !

తాజాగా సినీ ప్రముఖులంత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మీటింగ్ హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ చైర్మన్ దిల్ రాజుతో కలిసి నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో పాటు.. ప్రముఖ ప్రొడ్యూసర్లు సురేష్ బాబు, అల్లు అరవింద్.. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, రాఘవేంద్ర రావు లాంటి వారంతా ఈ మీటింగ్ కు హాజరయ్యారు. అయితే హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్న.. మంచు విష్ణు మాత్రం ఈ మీటింగ్ కు రాకపోవడం చర్చనీయాంశం అయింది. ఆయనకి బదులుగా సెక్రటరీ శివబాలాజీ ఈ సమావేశంలో హాజరయ్యాడు.

CM Revanth holds meeting with Tollywood actors, filmmakers

అయితే ఇండస్ట్రీకి ఏ చిన్న సమస్య వచ్చినా ఇండస్ట్రీకి పెద్దన్న పాత్ర పోషించే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సమావేశానికి రాలేదు. అంతా మొదట ఈ సమావేశంలో చిరునే పాల్గొంటారని భావించారు. కానీ.. ఆయన ఈ సమావేశంలో పాల్గొనకపోవడం అందరికీ షాక్ కలిగించింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి హాజరు కాకపోవడానికి కారణం సీఎం రేవంత్ రెడ్డి అని.. స్వయంగా రేవంత్ చిరుకి మీరు ఈ మీటింగ్‌కు రావాల్సిన అవసరం లేదని చెప్పినట్లు సమాచారం. ఎందుకంటే.. చిరంజీవి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటాడు. కరోనా టైం లోను సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికులకు తన సొంత చారిటీ ట్రస్ట్‌తో నిత్యాసర సరుకులు అందించడమే కాదు.. గవర్నమెంట్‌కు ఆక్సిజన్ సిలిండర్లను.. రాష్ట్రవ్యాప్తంగా తన సొంత డబ్బుతోనే పంచి ఇచ్చాడు. సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించిన చిరంజీవిని పిలిచి.. ఇలాంటి సమావేశంలో.. అలా చెయి.. ఇలా చెయి అని సూచనలు ఇవ్వడం సబబు కాదని ఆయన తరపున ఇండస్ట్రీ రావడమే ఉత్తమం అని.. సీఎం రేవంత్ రెడ్డి భావించాడట. ఇదే విషయాన్ని అధికారులతో చెప్పారని.. అందుకే చిరు ఈ సమావేశానికి వచ్చేందుకు ఇష్టం ఉన్న సీఎం.. చిరు గౌరవ మర్యాదల విషయంలో భంగం కలగకూడదనే ఇలాంటి డిసిషన్ తీసుకున్నాడని సమాచారం.

పైగా చిరంజీవి సోదరుడు ఏపీ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా బాధితులు వ్యవహరిస్తున్నాడు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య ఎలాంటి పొరపత్యాలు రాకూడదని ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ సమావేశం తర్వాత దిల్ రాజు మాట్లాడుతూ ఈ సమావేశం టికెట్ రేట్ల‌ పెంపు, బెనిఫిట్‌షోల‌ పర్మిషన్ల కోసం జరిగిన మీటింగ్ కాదని చెప్పుకొచ్చాడు. తెలుగు సినీ ఇండస్ట్రీ భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా చక్రం తిప్పేలా హాలీవుడ్ దర్శక, నిర్మాతలు కూడా హైదరాబాద్‌కు వచ్చి మరి షూటింగ్స్ చేసుకునే రేంజ్‌కు ఎలా ఎదగాలని విషయాలపై చర్చలు జరుపుకున్నామని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. మరి ఈ కీలక చర్చల పరిణామం భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.