సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఎంతోమంది హీరోయిన్‌లుగా అడుగుపెట్టి సక్సెస్ సాధిస్తూ ఉంటారు. అలా అతి తక్కువ టైంలోనే మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకునే హీరోయిన్లలో బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్ ఒకటి. టాలీవుడ్‌లో మహేష్ బాబు 1 నేనొక్కడినే సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన ఈ అమ్మడు తర్వాత తెలుగులో రెండు, మూడు సినిమాల్లో నటించిన ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేక పోయింది. తెలుగు సినీ ఆడియన్స్‌లో కృతి మెప్పించలేకపోయారు.
ఇక కృతి.. ప్రభాస్ తో కూడా అదిపురుష్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోయింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెక్కేసిన కృతి.. అక్కడ వరుస సినిమాలో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఇమేజ్ సొంతం చేసుకుంది. తన కెరీర్ ప్రారంభించిన మొదటి నుంచి కేవలం సినిమాల్లోనే కాకుండా.. యాడ్స్ ప్రమోషన్స్ లో డబ్బులు సంపాదిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. బిజినెస్ రంగంలోను రాణిస్తుంది.
అలాంటి ఈ అమ్మడు గత కొద్ది రోజులుగా తనకంటే 9 ఏళ్ల చిన్నవాడైన ఓ వ్యక్తితో ఎఫైర్ లో ఉందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అతను ఎవరో కాదు మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని, అతని భార్య సాక్షికి సన్నిహితుడైన ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఫర్ కబీర్ బహియా అట. అతడితో చాలాకాలం బన్నీ, కృతి డైటింగ్ చేస్తుందని టాక్ నడుస్తుంది. ఇలాంటి క్రమంలో తాజాగా క్రిస్మస్ వేడుకలు చేసుకున్న కృతి.. ఆ ఫోటోలు షేర్ చేసుకుంది. వాటిలో కబీర్ తో కలిసి దిగిన ఫోటోలు కూడా ఉండడంతో మరోసారి ఈ వార్త వైరల్ గా మారింది.