టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని రాణిస్తున్నాడు. ఇలాంటి క్రమంలో తాజాగా మరో సినిమాతో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి బరిలో వెంకీ నుంచి సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు టీం. అందులో భాగంగానే వెంకటేష్.. బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బికే సీజన్ 4 గెస్ట్‌గా పాల్గొన్నాడు. ఈ షోలో వెంకటేష్ బాలయ్య కలిసే సందడి చేశారు.
ఇందులో భాగంగా సినిమా విశేషాలతో పాటు.. పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను మాట్లాడుకున్నారు. ఇక వెంకీ మొదటిసారి తన ఫ్యామిలీ గురించి షోలో రియాక్ట్ అయ్యాడు. తన భార్య గురించి వెంకటేష్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల కుటుంబాలు సోషల్ మీడియాలో.. అలాగే పబ్లిక్ ముందు ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. కానీ.. వెంకి మాత్రం తన కుటుంబాన్ని ఇప్పటికీ మీడియా ముందుకు తీసుకురాలేదు. కనీసం సినిమా ఫంక్షన్లకు కూడా వాళ్లు వచ్చిన దాఖలాలు లేవు. ఈ క్రమంలో వెంకి కుటుంబం గురించి తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ ఉంటుంది.
దీంతో దాదాపు చాలా ఏళ్ల తర్వాత వెంకి మామ్మ తన ఫ్యామిలీ గురించి ప్రస్తావించాడు. అందులో మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరని బాలయ్య ప్రశ్నించగా.. నా భార్య నా బెస్ట్ ఫ్రెండ్. ఆమె వల్ల నాకు మరో బెస్ట్ ఫ్రెండ్ అవసరం లేకుండా పోయింది. ఏ మాత్రం సమయం దొరికిన తనతో టైం స్పెండ్ చేయాలని చూస్తా. కలిసి టూర్స్ కి వెళ్ళిపోతాం. ఆమెతో కలిసి నేను అప్పుడప్పుడు వంటగదిలో గరిట కూడా తిప్పుతా. అది నాకు చాలా ఇష్టం అంటూ వెంకటేష్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోని వెంకటేష్ చేసిన కమెంట్స్ వైరల్ అవడంతో.. వెంకటేష్ ఫ్యామిలీ హీరో గానే కాదు.. ఓ మంచి ఫ్యామిలీ మ్యాన్‌గాను గుర్తింపు తెచ్చుకుంటున్నాడంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.