సంధ్య థియేటర్ తొక్కీసులాట ఇష్యూలో నిందితుడుగా అల్లు అర్జున్‌ను నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఎంతో మంది ప్రముఖులతో పాటు.. పలువురు బాలీవుడ్ నటి, నటలు కూడా అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అలా.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై.. బాలీవుడ్ నటి, బిజెపి ఎంపీ కంగనా రనౌత్ రియాక్ట్ అయింది. ఆమె మాట్లాడుతూ బన్నీ ఆరెస్ట్‌పై చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి.
సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కేసులాట కేసులో అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం పై ఆమె రియాక్ట్ అవుతూ మూవీ టీంతో పాటు.. ప్రజలు కూడా బాధ్యతగా ఉండాలని వెల్లడించింది. కేవలం హీరోలను బలి చేయడం సరి కాదంటూ చెప్పుకోచ్చిన కంగనా.. ఆయన అరెస్టును ఖండిస్తూ కామెంట్లు చేసింది. ఇక బన్నీ అరెస్టుపై ఆమెతో పాటే.. కేంద్ర మంత్రులు, బిజెపి ఎంపీలు.. బండి సంజయ్, కిషన్ రెడ్డి కూడా ఖండిస్తూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కంగనా అల్లు అర్జున్ అరెస్ట్‌ను కండించి బన్నీకి సపోర్ట్ చేస్తూ చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.
కాగా కొద్ది సేపటి క్రితం అల్లు అర్జున్ జైల్ నుంచి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మద్యంతర బెయిల్‌తో.. అల్లు అర్జున్ జైలు నుంచి రిలీజై మొదట.. గీత ఆర్ట్స్ ఆఫీస్ కి వెళ్లారు. అక్కడ మామ తో కాసేపు ముచ్చటంచిన తర్వాత.. భార్య, పిల్లలు.. మామ ఇంట్లోనే ఉండడంతో.. ఫస్ట్ తన అత్తారింటికి వెళ్లి.. పిల్లలని, భార్యని తీసుకొని తన ఇంటికి చేరుకున్నాడు. అయితే.. క్రౌడ్ పోగావడంతో సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయని.. అల్లు అర్జున్‌ను కెమెరా కళ్ళకు చిక్కకుండా వెనక గేటు వైపు నుంచి రిలీజ్ చేశారు పోలీసులు.