” పుష్ప 2 ” క్లైమాక్స్ లో బిగ్ సర్ప్రైస్.. ఫ్యాన్స్ కు పండగే..

దేశ‌ వ్యాప్తంగా పుష్పరాజ్ ఫీవర్ కొనసాగుతుంది. ఆల్రెడీ సెన్సార్ టాక్ పూర్తిచేసుకుని మరికొద్ది గంటల్లో బాక్సాఫీస్ పలకరించనున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో పిక్స్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ జోష్ డబల్ చేసే న్యూస్ ఒకటి ఫిలిమ్స్ సర్కిల్స్ లో వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఏంటా న్యూస్ అనుకుంటున్నారా.. ఇప్పటికే పుష్ప సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కొట్టిన అల్లు అర్జున్ పుష్ప 2తో తన సత్తా చాటుకోవడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత దీనికి ఫ్రీక్వెల్ గా పుష్ప 3 వస్తుందంటూ ఇప్పటికే ప‌లు అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

ఇక రష్మిక కూడా.. తాజాగా దీనిపై ఇండైరెక్ట్ హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు సుకుమార్ కూడా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ..మీ హీరో మరో రెండు సంవత్సరాలు సమయం ఇస్తే పుష్ప 3 కూడా తీసి రిలీజ్ చేస్తానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇదే ప్రమోషన్స్ లో బన్నీ చేసిన కామెంట్స్ ఆడియన్స్ లో జోష్‌ను తగ్గించేసాయి. ఇవన్నీ మాట్లాడుతూ పుష్ప 3 ఉంటుందా అని యాంకర్ ప్రశ్నకు అమ్మో మళ్లీనా.. నా వల్ల కాదు అంటూ కామెంట్స్‌ చేసాడు.

దీంతో పుష్ప 3 ఉండదని.. పుష్ప 2తో సినిమాకు కంక్లూజ‌న్ వచ్చేసిందంటూ అంతా భావించారు. కానీ.. సెన్సార్ అప్డేట్ ప్రకారం పుష్ప 3కి సంబంధించిన డిస్కషన్ మరోసారి మొదలైంది. క్లైమాక్స్ లో పుష్స 3కు సంబంధించిన లీడ్‌ ఉంటుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ లీడ్ ఆడియన్స్ ఓ రేంజ్ లో ఎక్సైట్ చేసేలా ప్లాన్ చేశాడట సుక్కు. ఈ క్రమంలోనే ప్రస్తుతం బన్నీ ఫ్యాన్స్‌కు పుష్ప 3 పై మరోసారి ఆశలు చిగురించాయి. పుష్ప 3 హైప్‌ నేషనల్ లెవెల్ లో పీక్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. సినిమా రిలీజై బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుంటే ఇక పుష్ప 3 సెట్స్‌ పైకి వెళ్ళకముందే ఆడియన్స్ లో మరిన్ని అంచనాలు నెలకొంటాయి.