టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మంచి ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సినిమాలపరంగా హ్యాట్రిక్ తో మంచి ఫామ్ లో ఉన్న బాలయ్య.. ప్రస్తుతం బాబి డైరెక్షన్లో డాకు మహారాజ్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమాను.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా.. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా.. శ్రాద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతెలా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో.. జనవరి 12న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఈ క్రమంలోనే సినిమాపై ఎప్పటికీ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు.. సినిమా ప్రమోషన్స్‌ను కూడా.. మెల్లమెల్లగా మొదలుపెట్టారు మేకర్స్. తాజాగా సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు డేగ డేగ అంటూ సాగే పవర్ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారం.. ఆహాహా లో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాక్స్ షోలో.. త్వరలో రిలీజ్‌కానున్న సినిమాల ప్రమోషన్ జరుగుతాయని సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే నెక్స్ట్ ఎపిసోడ్‌కు విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి గెస్ట్లుగా రానున్నారంటూ సమాచారం.
ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హీరోగా.. అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూపొందింది. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 14న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇక సినిమా రిలీజ్‌ను కొద్ది రోజుల క్రితం అఫీషియల్ గా ప్రకటించిన మేకర్స్.. ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా అన్‌స్టాపబుల్‌లో సందడి చేయనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ నెటింట వైరల్‌గా మారడంతో.. సంక్రాంతికి బరిలో దిగనున్న వెంకటేష్ సినిమాకు బాలయ్య సపోర్ట్ చేస్తున్నాడు అంటూ.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు బాలయ్య ప్రమోషన్స్ వేరే లెవెల్ లో ఉండబోతున్నాయి అంటూ.. ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు వెంకీ ఫ్యాన్స్.