టాలీవుడ్ నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఎప్పటినుంచో నందమూరి ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ డబ్యూ మూవీని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. హనుమాన్ సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ వర్మతో.. మోక్షజ్ఞ మొదటి సినిమా ప్రకటన జరిగిన సంగతి తెలిసిందే. దీనికి ఆదిలోనే ఎండ్ కార్డ్ పడినట్లు తెలుస్తోంది. సినిమాకి కథ నేనే అందిస్తా.. కానీ డైరెక్టర్ గా నా అసిస్టెంట్ వ్యవహరిస్తాడని ప్రశాంత్ వర్మ వెల్లడించడంతో.. బాలకృష్ణ తనకి నో చెప్పేసాడని.. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ కాంబో మూవీ ఆగిపోయింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే.. ఈ విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే బాలయ్య.. మోక్షజ్ఞ కోసం మరో స్టార్ డైరెక్టర్‌ను లైన్‌లో పెట్టడని తెలుస్తుంది.
కాగా.. తాజాగా మోక్షజ్ఞ తండ్రిని ఉద్దేశిస్తూ చేసిన ఓ పోస్ట్ నెటింట వైరల్‌గా మారుతుంది. మోక్షజ్ఞ ఓ పోస్ట్ షేర్ చేస్తూ.. తండ్రి బాలయ్యను పట్టిస్తే రూ.50 లక్షల ప్రైజ్ మనీ ఇస్తానంటూ ఆఫర్ చేశాడు. ఇంతకీ బాలకృష్ణ ఏమైపోయారు.. ఎక్కడికి వెళ్లారు.. ఆయన్ని పట్టిస్తే రూ.50 లక్షలు ఇవ్వడమేంటి.. అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. నాన్నను పట్టిస్తే రూ.50 లక్షలు ఇస్తానని మోక్షజ్ఞ ప్రకటించింది ఎందుకోకాదు.. బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాని ఉద్దేశిస్తూ. తాజాగా మోక్షజ్ఞ.. తన సోషల్ మీడియా వేదికగా వాంటెడ్ డాకు మహారాజ్ అని పోస్ట్‌ను షేర్ చేసుకున్నాడు. రూ.50 లక్షల ప్రైజ్ మనీ అంటూ రాసుకోచ్చాడు.
ఇక ఈ పోస్టులో డాకు మహారాజ్ మూవీలో.. బాలయ్య డాకు మహారాజ్ పిక్ పై వాంటెడ్ ట్యాగ్ జోడిస్తూ షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం మోక్షజ్ఞ పెట్టిన ఈ పోస్ట్ నెటంట తెగ వైరల్ అవుతుంది. డాకు మహారాజ్ నుంచి రిలీజ్ అయిన డేగ డేగ సాంగ్.. ఇప్పటికే యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా.. సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా యూనిట్ ప్రమోషన్స్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భార్య సౌజన్య, సూర్యదేవర నాగవంశీలు సంయుక్తంగా ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తుండగా బాబి డైరెఓన్‌లో సినిమా రూపొందుతుంది.