టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోస్ అంతా పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్నా.. ఇప్పటికీ సీనియర్ స్టార్ హీరోగా నెంబర్ 1 పొజిషన్‌ను కోల్పోకుండా స్ట్రాంగ్ గా నిలబడ్డాడు చిరంజీవి. ఇప్పటివరకు తన కెరీర్ల 156 సినిమాల్లో నటించిన ఆయన.. సినీ కెరీర్ మొత్తంలో ఒకే డైరెక్టర్ తో ఏకంగా 23 సినిమాల్లో నటించి మెప్పించాడు. అయితే వీరిద్దరి కాంబోలో వచ్చిన దాదాపు 90 శాతం సినిమాలో సక్సెస్ రేట్ అందుకున్నాయి. ఒకే హీరో, ఒకే డైరెక్టర్ తో 23 సినిమాల కాంబినేషన్ అంటే అది సాధారణ విషయం కాదు. పెద్ద సంచలనం. అలాంటి దర్శకుడిని చిరు ఒకానొక సందర్భంలో అవమానించేలా కామెంట్ చేశారు.
అయితే.. ఇదే విషయంపై ఆ స్టార్ డైరెక్టర్ తన ఆవేదన వ్యక్తం చేస్తూ సెటైరికల్ కామెంట్స్ బేశారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు.. చిరంజీవి ఆయనను అవమానించడం ఏంటి.. అసలు ఏం జరిగిందో.. ఒకసారి చూద్దాం. ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ఏ.కోదండరామిరెడ్డి తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో సినిమాలను తెరకెక్కించి తిరుగులేని దర్శకుడుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. అయితే.. ఏ. కోదండరామిరెడ్డి.. చిరంజీవి హీరోగా 23 సినిమాలను తెరకెక్కించారు. కాగా ఇటీవల కాలంలో చిరంజీవి ఓ ఈవెంట్లో తనకు పేరు తీసుకువచ్చిన దర్శకులు, విజయాలను అందించిన దర్శకుల గురించి మాట్లాడుతూ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు. అయితే కోదండరామిరెడ్డి పేరు మాత్రం ఆయన ప్రస్తావించలేదు. అప్పట్లో ఈ న్యూస్ హట్ టాపిక్‌గా వైరల్ అయ్యింది. 23 సినిమాలు చేసిన అన్ని హిట్స్ ఇచ్చిన డైరెక్టర్‌ను ఎలా మర్చిపోయారు అంటూ కాస్త నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపించాయి.
అయితే ఇదే విషయంపై కోదండరామిరెడ్డికి ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురయింది. దానిపై ఆయన రియాక్ట్ అవుతూ చిరంజీవి తన పేరు ప్రస్తావించకపోవడం పై అసహనం వ్యక్తం చేశారు. నేను ఎంతో బాధపడ్డాను.. చాలా చాలా బ్యాడ్ గా ఫీల్ అయ్యానని.. 23 సినిమాల సక్సెస్ ఇచ్చా.. అన్ని హిట్స్ ఇచ్చిన.. ఇలా చేస్తాడు అనుకోలేదు అంటూ వెల్లడించాడు. దీనిపై ఇంటర్వ్యూవర్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో పార్టీలు మారినంత ఈజీగా ఇది కూడా మారిపోయిందా అన్నీ యాంకర్ ప్రశ్నించగా అదే జరిగిందేమో అంటూ దర్శకుడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే తర్వాత చిరంజీవిది పొరపాటున చేసిన పని అని.. ఆయనతో వెల్లడించడం.. వారిద్దరి మధ్యన సఖ్యత కుదిరింది. మళ్లీ వారిద్దరూ మంచి సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా చిరంజీవి గిన్నిస్ రికార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే ఈ కార్యక్రమంలో కూడా కోదండరామిరెడ్డి హాజరయ్యారు. అలాగే ఏఎన్ఆర్ జాతీయ అవార్డు మెగాస్టార్‌కు అందిస్తున్న సందర్భంలోనూ ఆయన పాల్గొన్నారు.