సినీ ఇండస్ట్రీలో ఒక సినిమాను తెరకెక్కించి సక్సెస్ సాధించాలంటే సినిమాలో కథ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలోనే హీరోలు కూడా కథ ఎంచుకునే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా మంచి కథలను ఎంచుకునే ప్రతిభ చాలా తక్కువ మంది హీరోలకు మాత్రమే ఉంటుంది. ఈ క్రమంలో కొంతమంది హీరోలు వరుస సినిమాలో నటిస్తూ సూపర్ హిట్స్ తమ ఖాతాలో వేసుకుంటూ ఉంటారు. మరికొందరు వరుస ఫ్లాప్‌లతో ఫేడౌట్ హీరోలుగా మారిపోతూ ఉంటారు. టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని.. గత మూడు సినిమాలను చూస్తే దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం ఇలా మూడు కథలతోను వైవిద్యతను చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కమర్షియల్ గా సక్సెస్ను సాధించాడు.
నాని తన సినిమాలతో.. నటనతో.. మంచి మార్కులు కొట్టేస్తున్నాడు. మొదట్లో చిన్న సినిమాలు నటిస్తూనే అంచలంచలుగా ఎదుగుతూ పాన్ ఇండియన్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం నాని సినిమాలు సులువుగా రూ.100 కోట్ల గ్రస్స్ కలెక్షన్లను కొల్లగొడుతూ ఉండడం విశేషం. అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్లు రాబడుతున్నాయి. డిజిటల్ హక్కుల సైతం మంచి డిమాండ్ ఉంటుంది. అలా టాలీవుడ్‌లో సినిమా సినిమాకు.. క్రేజ్ మరింతగా పెంచుకుంటూ పోతున్నాడు నాని.
ఇక తమిళ్ ఇండస్ట్రీలో శివ కార్తికేయన్ కూడా ఇదే కోవకు చెందుతాడు. ఆయన కూడా మొదటి చిన్న హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా మారిపోయాడు. అమరాన్‌తో ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాడు. నాని సినిమాలు ఇతర భాషలో ఆధారపడుతుండగా.. శివ కార్తికేయన్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తున్నాయి. నాని, శివ కార్తికేయన్ కెరీర్ పరంగా మరిన్ని సక్సెస్లు అందుకోవాలంటూ అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి సినిమాలు పక్కింటి అబ్బాయిల సినిమాలలా ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంతో.. వీరి క్రేజ్ రోజురోజుకు మరింతగా పెరుగుతుంది.