చిరు రిజెక్ట్ చేసిన కథతో హిట్‌ కొట్టి స్టార్ హీరోగా మారిపోయిన టాలీవుడ్ విలన్.. ఎవరంటే..?

మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగాస్టార్ తను వద్దకు వచ్చిన ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా రిజెక్ట్ చేసిన కథలలో చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు కూడా అందుకున్నాయి. అలా గతంలో మెగాస్టార్ తన వద్దకు వచ్చిన ఓ సినిమాను రిజెక్ట్ చేయడంతో.. ఆ అవకాశం మరొకరికి వెళ్లి అతను స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్నాడు. అయితే అప్పటివరకు టాలీవుడ్ లో విలన్ గా రాణించిన ఆ న‌టుడు.. చిరంజీవి రిజెక్ట్ చేసిన కథలో హీరోగా నటించి స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్నాడు. తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు ద‌క్కించుకుని స్టార్ హీరోగా మారిపోయాడు. ఇంతకీ చిరంజీవి రిజ‌క్ట్‌ చేసిన ఆ సినిమా ఏంటో.. ఆ సినిమాలో నటించి సక్సెస్ అందుకున్న విలన్ ఎవరో ఒకసారి తెలుసుకుందాం.

Chiranjeevi and Mohan Babu: Strange ‘friends’! | Telugu Cinema

ఇంతకీ అత‌నేవ‌రో కాదు మోహన్ బాబు. మొదటి చిరంజీవితో తెరకెక్కించాలనుకున్న ఓ కథను ఆయన రిజెక్ట్ చేయడంతో.. ఆ కథ మోహన్ బాబు గ్రీన్ నటించాడు. ఈ సినిమా తర్వాత విలన్ నుంచి హీరోగా మారాడు. అంతకుముందు వరకు క‌రుడు గట్టిన విలన్ గా ప్రేక్షకులను భయపెట్టిన మోహన్ బాబు.. తర్వాత పలు పాజిటివ్ రోల్స్ లో, సెకండ్ హీరో గాను కనిపించాడు. అయితే తర్వాత సినిమాల్లో హీరోగా నటించాలని కసితో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన అల్లుడుగారు మూవీలో హీరోగా అవకాశాన్ని కొట్టేసాడు. అలాగే రౌడీ మొగుడు టైటిల్ తో మరో సినిమాలోని హీరోగా నటించి మెప్పించాడు. అయితే అప్పటికే లీడ్ రోల్స్ చేస్తున్న.. విలన్ పాత్రలోనూ నటించడం ఆపలేదు.కానీ 1991లో మోహన్ బాబు సోలో హీరోగా వ‌చ్చి బ్లాక్ పాస్టర్ సక్సెస్ అందుకున్న మూవీ మాత్రం అసెంబ్లీ రౌడీ.

Assembly Rowdy Reviews + Where to Watch Movie Online, Stream or Skip?

బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మొదటి చిరంజీవితో చేయాలని ఆయన భావించారట. చిరంజీవికి కథ నచ్చినా.. వ‌రుస సినిమాల‌ కారణంగా నాకు కాస్త సమయం కావాలని అడిగారట. దీంతో బి.గోపాల్ ఆ కథను మోహన్ బాబు దగ్గరకు తీసుకువెళ్లి ఆయనతో గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నాడు. ఇక మోహన్ బాబు హీరోగా సినిమా సెట్స్‌ పైకి వచ్చింది. స్టార్ బ్యూటీ దివ్యభారతిని సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారు. అయితే ఇది స్ట్రైట్ మూవీ కాదు. తమిళ్లో సూపర్ సక్సెస్ అందుకున్న వేలై కీడైచుడుచు సినిమా ఆధారంగా రూపొందింది. ఈ సినిమా తమిళ్లో సత్యరాజ్ హీరోగా నటించాడు. ఇక‌ మోహన్ బాబు ఇమేజ్ కు తగ్గట్టుగా తెలుగు నేటివిటీలో మార్పులు, చేర్పులు చేసి బి.గోపాల్ అసెంబ్లీ రౌడీ టైటిల్ తో సినిమాను రూపొందించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో అప్పటి వరకు విలన్ పాత్రలకు ఒప్పుకున్న సినిమాల్లో మాత్రమే నటించి తర్వాత హీరోగా కంటిన్యూ అయ్యాడు.