టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఆయనను విపరీతంగా లైక్ చేస్తూ ఉంటారు. సినిమాలు, కుటుంబం తప్ప మరే విషయాలను పెద్దగా తల దూర్చని వెంకటేష్.. కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ అందరూ స్టార్ హీరోలతోనూ ఎంత సన్నిహితంగా మెలుగుతూ ఉంటాడు. సెంటిమెంట్, ఎమోషనల్ సన్నివేశాలకు క్యారాఫ్ అడ్రస్ గా నిలిచిన వెంకటేష్.. కామెడీ టైమింగ్‌లోనూ వైవిధ్యతను చూపిస్తూ ఉంటారు.
ఇప్పటివరకు తన కెరీర్‌లో 75 సినిమాలకు పైగా నటించి మెప్పించిన వెంకటేష్.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అయిన సౌందర్య, సిమ్రాన్, కుష్బూ , మీనా, భానుప్రియ లాంటి వారితోను రొమాన్స్ చేశాడు. అయితే ఆయన తన సినీ కెరీర్‌లో చెల్లి వారుస అయ్యే స్టార్ హీరోయిన్‌తోను వెండితెరపై రొమాన్స్ చేయడం గమనారం. ఆ హీరోయిన్ మరెవరో కాదు టాలీవుడ్ కింగ్ నాగార్జున భార్య.. అమల. వెంకటేష్‌కు.. నాగార్జున బావ అవుతాడని అందరికీ తెలిసే ఉంటుంది. మొదట నాగార్జున.. వెంకటేష్ చెల్లి లక్ష్మీని వివాహం చేసుకున్నాడు. నాగచైతన్య జన్మించిన తర్వాత ఏవో కారణాలతో వీరు విడిపోయారు. తర్వాత లక్ష్మీ మరో పెళ్లి చేసుకుంది.
అలాగే నాగార్జున కూడా తన కోస్టార్‌గా నటించినా హీరోయిన్ అమలతో ప్రేమలోపడి ఆమెను వివాహం చేసుకున్నారు. ఈ వరుసల్లో చూస్తే వెంకటేష్‌కు అమల చెల్లె అవుతుంది. అయితే పెళ్లికి ముందు అమల చాలామంది హీరోలతో నటించి మెప్పించింది. ఈ క్రమంలోనే నాగార్జునతో పాటు.. చిరు, రాజశేఖర్, కమలహాసన్, వెంకటేష్, రజనీకాంత్ లాంటి వారితోను నటించింది. వెంకటేష్‌తో అమల తోలిసారి 1988లో రక్త తిలకం సినిమాలో నటించింది. ఈ సినిమాలో వెంకటేష్, అమల తనదైన రొమాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత మరోసారి అగ్గిరాముడు సినిమాలో కలిసి నటించారు. అయితే ఈ సినిమాలో వెంకటేష్ డ్యూయల్‌రోల్ ప్లే చేశాడు. దీంతో ఈ మూవీలో అమలతో పాటు.. గౌతమి మరో హీరోయిన్గా నటించింది.