టాలీవుడ్ అక్కినేని హీరో నాగార్జున, నందమూరి హీరో బాలయ్య మధ్యలో విభేదాలు ఉన్నాయంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తునేఉన్నాయి. కానీ.. వీరిద్దరి మధ్య అనుబంధం చాటి చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా నాగార్జునకి.. బాలయ్య తమ్ముడుగా మారి, చైతన్యకు బాబాయిగా అండగా నిలిచిన సందర్భం ఒకటి ఉంది. గతంలో బాలయ్య, నాగార్జునకు పడదు అంటూ ఇద్దరి మధ్యలో విభేదాలు ఉన్నాయని ఎన్నో ప్రచారాలు నడిచినా.. తర్వాత బాలయ్యకు తనకు ఎలాంటి విభేదాలు లేవని నాగార్జున చెప్పేందుకు ప్రయత్నించాడు. ఒకటి రెండు ఈవెంట్లలో ఇద్దరు ఆ విషయంపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించినా.. ఇప్పటికే ఆ రూమర్ కొనసాగుతూనే ఉన్నాయి. తర్వాత వీరిద్దరూ పెద్దగా కలిసి కనపడకపోవడం ఆ వార్తలు మరింతలు మరింత బలపడ్డాయి.
అయితే గతంలో వీరిద్దరూ ఎంతో క్లోజ్ గా ఉండేవారు. పది పదిహేను ఏళ్ళుగానే ఈ వార్తలు వస్తున్నా.. ఇంతకుముందు ఎన్నో సందర్భాల్లో ఇద్దరు ఒకరికి ఒకరు తోడుగా నిలిచారు. అయితే అప్పట్లో సోషల్ మీడియా ఇంపాక్ట్ ఈ రేంజ్ లో ఉండేది కాదు. అలా గతంలో బాలయ్య.. నాగార్జునకు తమ్ముడిగా మారిపోయిన ఓ సంఘటన ఉంది. ఏఎన్ఆర్‌ను ఆప్యాయంగా బాబాయి అని పిలిచే బాలయ్య.. నాగచైతన్య తో బాబాయి అని పిలిపించుకోవడం విశేషం. ఇంతకీ ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో అసలు.. దీనికి కారణం ఏంటో చెప్పలేదు కదా.. ప్రస్తుతం టాలీవుడ్ కింగ్ గా రాణిస్తున్న నాగార్జున.. తనయుడు నాగ చైతన్యను జోష్ సినిమాతో పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దిల్ రాజు ప్రొడ్యూసర్గా, వాసు వర్మ డైరెక్టర్గా వ్యవహరించారు.
2009లో తారీకెక్కిన ఈ సినిమా ఆడియో ఈవెంట్ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు నాగ్. ఓ రకంగా చెప్పాలంటే నాగచైతను ప్రపంచానికే పరిచయం చేసిన వేదిక ఆనడంలో సందేహం లేదు. చాలామంది ప్రముఖులు దీనికి హాజరై సందడి చేశారు. టాప్ స్టార్స్ ఎంతోమంది వచ్చారు. నాగార్జునతో పాటు.. వెంకటేష్, మోహన్ బాబు, రాఘవేంద్రరావు, రామానాయుడు, రాజమౌళి, శ్రీను వైట్ల, బోయపాటి శ్రీను, శ్రీహరి ఇలా ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. అలాగే జోష్ సినిమా హీరోయిన్ అయినా కార్తీక.. తల్లి రాధతో కలిసి హాజరయింది. ఇక ఈ ఈవెంట్ కు బాలయ్య స్పెషల్ గెస్ట్ గా రావడం గమనార్హం. ఈ ఇవెంట్లో బాలయ్య మాట్లాడుతూ అక్కినేని ఫ్యామిలీతో తనకున్న బంధాన్ని గురించి వివరించాడు. నాగచైతన్య తాతగారు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు నాకు బాబాయ్. ఇప్పుడు నాగచైతన్యను ఆశీర్వదించడానికి బాబాయిగా నేను నివేదికపై ఉన్న అంటూ ప్రకటించాడు.
జోష్ ఆడియో ఈవెంట్లో బాలకృష్ణ చెప్పిన ఈ మాట ఆడియన్స్ లో కొత్త ఊపిరి తెచ్చింది. స్టేజ్ ప్రాంగణం అంతా దద్దరిలింది. ఈ సందర్భంగా ఆయన నాగార్జున పై కూడా పంచ్లు వేశాడు. తండ్రి ఏఎన్ఆర్ లాగే నటన పునికి పుచ్చుకున్నాడు. పోలికలు కూడా. వెరీ గుడ్.. కమర్షియల్ బిజినెస్ మాన్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలకు.. నాగార్జున సినిమాలు పోలిక ఉండవని.. పూర్తి భిన్నం అంటూ కామెంట్స్ చేశాడు. మా నాన్నగారు ఎప్పుడు ఓ మాట చెబుతుండేవారు.. అనుకరించేవాడు కాదు, అనుసరించేవాడే నిజమైన వారసుడవుతాడని. అలా నాగార్జున.. ఏఎన్ఆర్ బాబాయ్ ని అనుసరిస్తారంటూ వెల్లడించాడు. తర్వాత టిఎన్ఆర్ అవార్డ్ వేరుకల్లో మరోసారి నాగార్జున, బాలయ్య కలిసి కనిపించారు. తర్వాత వీరిద్దరూ కలవలేదు.