సాధారణంగా సినీ ఇండస్ట్రీలో.. ఇటీవల పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోల నుంచి సినిమాలు రిలీజై రూ.1000 కోట్ల కలెక్షన్‌లు కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం కేవలం ఇండస్ట్రీలో తన పదేళ్ల కెరీర్‌లోనే.. తాను నటించిన సినిమాలతో రూ.7000 కోట్ల కలెక్షన్‌లు కొల్లగట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇంతకీ ఇండస్ట్రీలో ఇలాంటి రికార్డు క్రియేట్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవరో కాదు.. తనే దీపికా పదుకొనే.
ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన 10 ఏళ్లలోనే తను నటించిన సినిమాలతో 7000 కోట్ల కలెక్షన్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. 2024లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సక్సెస్ అయిన కల్కి 2898ఏడి లో సుమతి పాత్రలో ఈమె నటించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రూ.1100 కోట్ల భారీ కలెక్షన్లను దక్కించుకుంది. ఇక ఈ ఏడదిలోనే దీపిక హీరోయిన్గా తెరకెక్కిన మరో మూవీ ఫైటర్. ఈ సినిమా ఆశించిన సక్సెస్ అందుకోకపోయినా.. రూ. 337 కోట్ల వసూళ్లను రాబట్టింది.
అలాగే షారుఖ్ ఖాన్ సరసన నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న మూవీ పఠాన్. ఈ సినిమాతో ఏకంగా రూ.1148 కోట్లు జవాన్ తో రూ.1050 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇక తను 2018లో ప్రధాన పాత్రలో నటించిన మూవీ పద్మావత్. ఇది బాక్సాఫీస్ రికార్డ్ క్రియేట్ చేసింది. అప్పట్లోనే 572 కోట్లు కలెక్షన్లను రాబట్టి సత్తా చాటుకుంది. 2017లో వచ్చిన అమెరికన్ మూవీ ఎక్స్ఎక్స్ఎక్స్ రిటర్న్ ఆఫ్ క్యాండర్.. మూవీలో కేజ్‌ఓ అనే పాత్రలో దీపిక పదుకొనే ఆకట్టుకుంది. ఇది ఏకంగా రూ.2600 కోట్ల వసూలను కొల్లగొట్టింది. అలా ఇప్పటివరకు కేవలం పదేళ్ల సినీ కెరీర్లో ఏకంగా రూ.7000 కోట్లు కలెక్షన్లను సాధించి ఏకైక హీరోయిన్గా దీపికా పదుకొనే రికార్డ్ క్రియేట్ చేసింది.