పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ బిజీ లైనప్‌లో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్‌గా ఎదురు చూస్తున్నా వాటిల్లో స్పిరిట్ సినిమా ఒకటి. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమా ఓ పవర్ఫుల్ కాఫ్ స్టోరీ గా రూపొందుతుంది. ప్రభాస్ తన కెరీర్లో ఇప్పటివరకు నటించని పోలీస్ గెటప్‌లో ఈ సినిమాలో ఆడియన్స్‌కు కనిపించనున్నాడు. ఈ క్రమంలో సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్‌లో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ఈ సినిమా మరింత వినూత్నంగా తెరకెక్కనుందని టాక్ నడుస్తుంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ నెటింట వైరల్‌గా మారుతుంది. ప్రస్తుతం స్పిరిట్ స్క్రిప్ట్ పనులను పూర్తిచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్క్రిప్ట్ వర్క్ సంబంధించిన ఒక గాసిప్ తెగ వినిపిస్తుంది. ప్రభాస్ పాత్ర మొదట పోలీస్ అయినప్పటికీ.. కథలో ట్విస్ట్‌ల కారణంగా ప్రభాస్ గ్యాంగ్ స్టార్ గా మారతాడని.. భారీ వైల్డ్ ఎలిమెంట్స్‌తో సినిమా రూపొందనుందని సమాచారం.
అలాగే ఈ సినిమాలో ప్రభాస్ కి విలన్ గా మరో పాన్ ఇండియన్ స్టార్ గట్టి పోటీ ఇవ్వనున్నాడట. ఇక సినిమా షూట్ ను వచ్చే ఏడాది ప్రారంభించనున్నారు మేకర్స్. దాదాపు రూ.400 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. హర్షవర్ధన్ రామేశ్వరం సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు.. టి సిరీస్, భద్రకాళి బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.