టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సీనియర్ స్టార్ హీరోగ మంచి ఇమేజ్‌తో దూసుకుపోతున్నడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన నటనతో లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే డజన్‌కు పైగా మెగా హీరోలను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసి టాలీవుడ్లో మెగా సామ్రాజ్యానే సృష్టించాడు. ఇక మెగాస్టార్ ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. తన ఫిట్నెస్తో ప్రేక్షకులను మైమరిపిస్తున్నాడు. ఏడుపదుల వయసులోనూ ఇంత యంగ్ లుక్ తో.. యాక్టివ్ గా కనిపించడానికి కారణాలు ఏంటి.. చిరంజీవి లైఫ్ స్టైల్ ఏంటి.. ఫేవరేట్ ఫుడ్ ఏదో తెలుసుకోవాలని ఆసక్తి ప్రేక్షకుల్లో కచ్చితంగా ఉంటుంది.
ఈ క్రమంలోనే చిరంజీవి ఓ సినిమా ఫంక్షన్ ఈవెంట్లో తన మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ ఎంటో వివరించాడు. సుమా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఈ సినిమా ఈవెంట్లో రాజమౌళి అనే ఓ మెగా అభిమాని చిరంజీవి ఫేవరెట్ ఫుడ్ ఏంటి అనే ప్రశ్నను పేపర్ పై రాసి ఇవ్వగా.. సుమ ఈ ప్రశ్నను చిరంజీవిపై సంధించింది. ఇక మొదటనుంచి మెగాస్టార్ భోజనప్రియుడు అన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ క్రమంలోనే సుమ చిరంజీవిని ప్రశ్నిస్తూ మీకు నాటుకోడి – చేపల పులుసు ఈ రెండిట్లో మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ ఏది అని ప్రశ్నించింది.
చిరంజీవి మాట్లాడుతూ ఆ ప్రశ్న అడుగుతుంటే నోరూరిపోతుంది. ఈ రెండు నేను వదలకుండానే తింటా అంటూ సమాధానం చెప్పాడు. అయితే రెండిట్లో ఒకటి మాత్రమే ఆప్షన్ గా తీసుకోవాలంటే మాత్రం.. నాకు ఎప్పటికీ చాపలు పులుసు మోస్ట్ ఫేవరెట్.. చాలా ఇష్టమంటూ వెల్లడించాడు చిరంజీవి. అందులోను మెగాస్టార్‌కు ఆయన తల్లి అంజనాదేవి చేతుల మీదగా చేసిన చేపల పులుసు అంటే చాలా ఇష్టం అట. ఈ విషయాన్ని ఎన్నో సందర్భాల్లో మెగాస్టార్ బహిరంగంగానే వెల్లడించాడు. అంతేకాదు అప్పుడప్పుడు వంటగదిలో దూరి చిరు కూడా తన చేతుల మీదుగా చేపల ఫ్రై చేస్తూ ఉంటారు. అలా గతంలో చిరు చేపట ఫ్రై వీడియో ఒకటి నెటింట తెగ వైరల్ అయింది.