నందమూరి అభిమానులకు త్వరలోనే బిగ్ గుడ్‌న్యూస్ వినపడనుందట. నందమూరి నటసింహం బాలకృష్ణ పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకొనున్నట్లు సమాచారం. ప్రతి ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా భారతదేశ ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి చేతుల మీదగా పద్మ పురస్కారాలు అందజేసే విషయం అందరికీ తెలిసిందే. దాదాపు అన్ని రంగాల్లో ప్రముఖ వ్యక్తుల సేవలను గుర్తించి ఈ పురస్కారాలను వారికి అందజేస్తారు. అలా ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి.. పద్మభూషణ్ అవార్డును దక్కించుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు చిరుకు పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది. అయితే పద్మ పురస్కారాలు స్వయంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఇచ్చే గౌరవం. అలాగే ఆ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు సిఫార్సులను పరిగణించి ఇచ్చే అవార్డులు కూడా కొన్ని ఉంటాయి.
అలా ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్మభూషణ్ అవార్డుకు నందమూరి బాలకృష్ణ పేరును అలాగే నటుడు మురళీమోహన్ పేరును సిఫార్సు చేశారు. ఇక ప్రస్తుతం టిడిపి కేంద్ర ప్రభుత్వం బిజెపితో మిత్రపక్షంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య బాబుకి పద్మభూషణ్ అవార్డు 100% ఫిక్స్ అయిపోయినట్లే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని విధాల బాలయ్య బాబు పద్మభూషణ్ అవార్డుకు అర్హుడు కూడా కావడంతో.. అవార్డు ఆయనకే దక్కుతుందని సమాచారం. ఐదు దశాబ్దల సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్ లో నటించిన బాలయ్య.. సినిమాల్లో ఖ్యాతిని పెంచుకున్నాడు. అలాగే రాజకీయాల్లో ఇప్పటికే హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసి హ్యాట్రిక్ సక్సెస్ అందుకొని రాణిస్తున్నాడు. అంతేకాదు గొప్ప సామాజిక వేతగాను ఎంతో మందికి అండగా నిలిచిన బాలయ్య.. వైద్యరంగం ద్వారా కూడా ఆయన సేవలను ప్రజలకు అందిస్తున్నాడు.
బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నడుపుతూ వేల మందికి ఉచిత వైద్యం చేయిస్తున్నాడు. ఇలా వివిధ రంగాల్లో లక్షలాదిమందికి సేవలందిస్తున్న బాలయ్యకు.. ఇప్పటికే పద్మభూషణ్ అవార్డ్ రావాల్సింది.. చాలా ఆలస్యమైందని అభిప్రాయాలు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈయనతో పాటే ప్రముఖ సీనియర్ నటుడు మురళీమోహన్‌కి పద్మభూషణ్ అవార్డు దాదాపు ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. నిర్మాతగా ఎన్నో విజయవంతమైన సినిమాలను పూర్తి చేసిన మురళీమోహన్.. రాజకీయాల్లో రాణించారు. మంత్రిగా కూడా పనిచేసి సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడుకి అత్యంత ఆప్తుడుగా ఉన్న మురళి మోహన్ పేరు కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించారట. జనవరి 26న ఈ పురస్కారం రాష్ట్రపతి చేతుల మీదుగా వీరిద్దరూ అందుకోనున్నారని తెలుస్తుంది.