హ్యాట్రిక్ తో దూసుకుపోతున్న బాలయ్య.. ఫస్ట్ టైం కొత్త జానర్.. సెట్ అవుతుందా..?

నందమూరి నట‌సింహ బాలకృష్ణ ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో హ్యాట్రిక్ కోసం సిద్ధమవుతున్న బాలయ్య ప్రస్తుతం బాబి డైరెక్షన్లో తన 109వ సినిమాలో నటిస్తున్నాడు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతుంది. కథలో మార్క్ యాక్షన్ తో.. థ్రిల్లర్ అంశాలను కలిగి ఉంద‌ని టాక్. సినిమాలో ఎప్పుడు చూడని విధంగా బాలయ్య క్యారెక్టర్ కూడా కొత్తగా కనిపించనుందట. రెగ్యులర్ మాస్ రోల్ కాకుండా చాలా సంఘర్షణ, వైల్డ్, బోల్డ్ షేడ్స్ లో బాలయ్య పాత్ర కనిపించనుందని టాక్. అయితే ఇప్పటివరకు ఈ సినిమా సంబంధించిన గ్లింప్స్‌ తప్ప మరే అప్డేట్ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. సినిమా ఏ బ్యాక్ డ్రాప్‌లో ఉండబోతుంది.. ఏం చూపించబోతున్నారనేది.. కూడా క్లారిటీ ఇవ్వకుండా టైటిల్ కూడా అనౌన్స్ చేయకుండా.. మేకర్స్ గోప్యంగా వ్యవహరిస్తున్నారు.

NBK109 - Nandamuri Balakrishna Birthday Glimpse | Bobby Kolli | Thaman S |  S Naga Vamsi - YouTube

ఇక ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా నటించబోతుందని ఇటీవల మేకర్స్‌ ప్రకటించారు. ఇందులో బాబి డియోల్ నెగటివ్ షేడ్స్‌లో కనిపించనున్నారు. అయితే సినిమా రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ లేదు. కాగా ఈ సినిమా తర్వాత బాలయ్య.. బోయపాటి డైరెక్షన్ లో నటించనున్నాడు. ఈ సినిమా అఖండా 2 అని పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్న.. కొత్త కథతో సినిమా రాబోతుందని టాక్. ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొన్నాయి. ఇక ఇప్పటికే బోయపాటి బాలయ్య కాంబోలో సినిమాలు తరికెక్కిన‌ మూడు సినిమాల‌ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. దీంతో అత్యంత సక్సెస్ఫుల్ కాంబినేషన్ గా ఈ కాంబో నిలిచిపోయింది. కాగా ఈ రెండు సినిమాల తర్వాత బాలయ్య నటించబోయే సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ గా మారింది.

Latest Update on Balakrishna and Boyapati Srinu Film

ఎప్పుడు ఎవరు చూడని విధంగా.. సరికొత్త జోనర్‌లో ఈ సినిమా తెరకెక్కనుందట. డైరెక్టర్ శైలేష్‌ హిట్.. యూనివర్స్ నుంచి ఇప్పటికే సిరీస్‌లుగా రెండు సినిమాలు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నాయి. మొదటి భాగంలో విశ్వక్‌సేన్ నటించగా.. రెండో భాగంలో ఆడవిశేష్ మెప్పించాడు. ఇప్పుడు మూడో భాగం లో నాని హీరోగా నటించనున్నాడు. ఇది ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ సినిమా తర్వాత హిట్ 4 కోసం బాలయ్యను మేకర్స్ బాలయ్య హీరోగా నటిస్తే బాగుంటుంది అని భావిస్తున్నారట ఈ క్రమంలోనే బాలయ్యను డైరెక్టర్ అప్రోచ్ అయ్యారనే వార్త కూడా వినిపిస్తుంది. ఇక శైలేష్ కథ వినిపించిన.. బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు. దాదాపు కథ పై పాజిటివ్గా బాలయ్య నుంచి స్పందన వచ్చిందని.. సమాచారం.

అయితే బాలయ్య ఇలాంటి మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ను ఇప్పటివరకు నటించలేదు. ఆయనకి ఇది పూర్తిగా కొత్త జానర్. పైగా సస్పెండ్స్‌తో కొనసాగే ఈ మూవీకు బాలయ్య సెట్ అవుతారా.. ఆయనకు ఇలాంటి జోనర్ వర్కౌట్ అవుతుందా.. అనేది పెద్ద ప్రశ్నగా నిలిచింది. పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించే ఈ సీనియర్ హీరో.. యాక్షన్ సీన్లతో ఊచకోత కోయడం మనం చూసాం. అదిరిపోయే మాస్ స్టెప్పు ఉర్రూతలూగించిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ అంటూ తిరిగితే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా.. లేదా.. అసలు బాలయ్య నిజంగానే ఇలాంటి కొత్త జోన‌ర్‌లో సినిమా నటిస్తాడా.. లేదా.. అనే దానిపై క్లారిటీ రావాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.