సింపుల్ గా ఉన్న సో కాస్ట్లీ గురు.. సిద్ధార్థ పెళ్లిలో ధరించిన ఈ వాచ్ ధర తెలుసా..?

టాలీవుడ్ క్రేజీ హీరో సిద్ధార్థ్‌, హీరోయిన్ అదితి రావు హైదారి. తాజాగా మ్యారీడ్ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల వనపర్తి శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో వీరిద్దరి వివాహం చాలా ప్రైవేట్గా జరిగింది. ఇది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య హిందూ సాంప్రదాయ ప్రకారం వీరిద్దరూ వివాహ వేడుకలు గ్రాండ్ లెవెల్లో జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు తన ఇన్‌స్టా వేదికగా అదితి షేర్ చేసుకుంది.

ఈ క్రమంలో ఈ నూతన వధూవరులకు సినీ ప్రముఖులు,అభిమానులు విషెస్‌ తెలియజేశారు. అయితే ఈ పెళ్లి వేడుకల్లో చాలా సింపుల్ గా కనిపించిన సిద్ధార్థ్‌.. అదితి లుక్స్ అందరిని ఆకట్టుకున్నాయి. అదితి.. రూబీ, బంగారు ఆభరణాలు అలంకరించుకొని గోల్డెన్ ఆర్గాన్జ లెహంగాలో మహారాణిలా మెరిసింది. ఇక హీరో సిద్ధార్థ కుర్తా, వేస్టి ధరించి సింపుల్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. అయితే సిద్ధార్థ్ – అదితి పెళ్ళి ఫొటోస్ గత నాలుగు రోజులుగా నెట్టింట తెగ వైరల్ గా మారుతున్నాయి.

ఈ క్రమంలో సిద్ధార్థ్ ధరించిన వాచ్ పై నెటిజన్ల దృష్టిపడింది. బ్రౌన్ బెల్ట్.. గోల్డెన్ వాచ్ ధ‌రించి స్పెషల్ అట్రాక్షన్‌గా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఈ వాచ్ ఖ‌రీదు ఎంత అని ఆసక్తి ప్రేక్షకుల నెలకొంది. దీనిపై గూగుల్ సెర్చింగ్ లో మొదలుపెట్టగా.. సిద్ధార్థ్ ధ‌రించిన ఈ గోల్డ్ కేస్.. అడ్వాన్స్ పిగ్వేట్ రాయల్ వాచ్ ద్వారా అక్షరాల రూ.27.62 లక్షలని తెలుస్తుంది. సింపుల్గా కనిపిస్తున్న ఈ వాచ్ కాస్ట్ చూసి నోరెళ్ళబెడుతున్నారు నెటిజ‌న్స్.