బాలయ్య కార్ల కలెక్షన్ చూసారా.. ధరలు తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..!

నందమూరి నట‌సింహం బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రస్తానాన్ని తాజాగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుంటూ నేడు (సెప్టెంబర్ 1న) సినీ పెద్దలు అంతా కలిసి ఆయన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ గ్రాండ్ లెవెల్ లో చేస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్యకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు నెటింట వైరల్ గా మారుతున్నాయి. పాత వివాదులు, రికార్డులు , ఆయన ఆస్తులు ఇలా అన్ని ట్రెండ్రంగా మారాయి. అభిమానుల సైతం ఆయన గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో బాలుయ దగ్గర ఉన్న లగ్జరీ కార్ల కలెక్షన్ ఏంటి.. వాటి కాస్ట్‌లు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

బాలయ్య దగ్గర దాదాపు రూ.20 కోట్ల విలువ చేసే లగ్జరీ కార్లు ఉన్నట్లు సమాచారం. ఆయన దగ్గర ఉన్న కార్ల కలెక్షన్ విషయానికి వస్తే ముద్దుల కూతురు బ్రాహ్మణి ఆయనకు బెంట్లీ కాంటినెంటల్ కార్ గ‌తంలో గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆ కార్ కాకుండా బాల‌య్య‌ గ్యారేజీలో మొత్తం మూడు కార్లు ఉన్నాయి. అందులో ఒకటి మెర్సడేస్ బెంచ్ బిఎల్ఎఫ్ 400d, మరొకటి bmw 6 సిరీస్ జిటి, ఇంకోటి టయోటా ఇన్నోవా క్రిష్ట. ఇలా ఈ మూడు కార్లు చాలా లగ్జరీ, కాస్ట్లీ కార్లని తెలుస్తుంది.

Balakrishna new car price: బాలకృష్ణ రేంజ్ అంటే అదే మరి.. బహుమతిగా 4 కోట్ల  ఖరీదైన కారు..! – News18 తెలుగు

కార్లు పెద్దగా ఇష్టం లేని బాలయ్య.. సధార‌ణంగానే ఇంత లగ్జరీ కార్స్ మెయిన్టెయిన్ చేస్తున్నాడంటే.. ఇక ఆయనకు కార్ల పిచ్చి ఉండి ఉంటే.. ఆయన గ్యారేజ్ ఏ లెవెల్లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. బాలయ్య ఆస్తుల విషయానికి వస్తే ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆయనకు రెండు విలాసవంతమైన అధునాతన ఇళ్లతో సహా తండ్రి సీనియర్ ఎన్టీఆర్ వారసత్వం నుంచి వచ్చిన 100 ఎకరాల భూములు కూడా ఆయన పేరిట ఉన్నాయి. హైదరాబాద్‌లో కొన్ని స్టూడియోస్, మూవీ థియేటర్స్ కూడా బాలయ్యకు ఉన్నాయని సమాచారం. ఈ క్రమంలో అందరి దృష్టి నేడు జరగనున్న బాలయ్య గోల్డెన్ జూబ్లీపైనే ఉంది.