షార్క్ సీన్ చూసి నోరెళ్ళబెడుతున్న ఫార్మర్స్.. దేవర దెబ్బకు మైండ్ బ్లాకే..

టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ దేవర.. మరికొద్ది గంటల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ తరాకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొని సందడి చేస్తున్నాడు తారక్.. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రధాన నగరాల్లో మూవీ యూనిట్ వరుస ఇంటర్వ్యూలో సందడి చేశారు. అలాగే అటు విదేశాల్లోనూ తారక్ హడావిడి ప్రారంభించారు. తాజాగా లాస్ ఏంజల్స్ లో జరుగుతున్న బియాండ్ ఫెస్ లో ఎన్టీఆర్ సందడి చేశారు. అక్కడ స్టేజిపై ఎన్టీఆర్ మాట్లాడుతూ.. దేవర సినిమాను చూసేందుకు వచ్చిన ఆడియన్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేశాడు.

Jr NTR Devara Movie Song: Devara First Single Fear Song To Release On Jr NTR's Birthday | Times Now

ఈ క్ర‌మంలో దేవర టీజర్, ట్రైలర్ స్క్రీనింగ్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫారనర్స్. ముఖ్యంగా ఈ సినిమాలో షార్క్ సీన్ చూసి ఫిదా అయ్యారు. ట్రైలర్ అయ్యాక అందరు లేచి నిలుచొని మరి క్లాప్స్ కొడుతూ సినిమా పై ఉన్న ఆసక్తిని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ట్రైలర్ చూసిన ఫారనర్స్ కూడా సినిమాపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ట్రైలర్‌కే ఈ రేంజ్‌లో షాక్ అవుతుంటే ఇక సినిమా చూస్తే ఏమైపోతారో అంటూ తారక్ ఫ్యాన్స్ ఆనంద నీ వ్యక్తం చేస్తున్నారు. ఇక నేడు సాయంత్రం దేవర సినిమా ప్రీమియర్ ను బియాండ్ ఫేస్ట్‌లో ప్రదర్శించనున్నారు.

Jr NTR Devara Movie Archives - India The News

అటు తారక్ కూడా ఇదే ఫస్ట్ లో ఆడియన్స్‌తో కలిసి సినిమా చూసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే సినిమా గురించి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించే టైంలో సినిమా గురించి వినీ ఆశ్చర్యపోయా.. ఇదొక అద్భుతమైన యాక్షన్ డ్రామా.. ప్రేక్షకులు ఫ్రెష్ అనుభూతిని పొందుతారు. 95% రికార్డింగ్ పనులను విదేశాల్లోనే పూర్తి చేసాం. దేవర సినిమా చూస్తున్నంత సేపు అవెంజర్స్, బ్యాట్స్మెన్ మూవీస్ లాంటి హాలీవుడ్ సినిమాలను చూసినా అనుభూతి ఉంటుందంటూ చెప్పుకోచారు. దీంతో ఇప్పుడు దేవర సినిమాపై ప్రేక్షకుల్లో మరింత బజ్ ఏర్పడింది.