దేవుళ్ళు ‘ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆ అమ్మడి అందం ముందు స్టార్ హీరోయిన్లు కూడా బలాదూర్..!

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి ప్రస్తుతం హీరో, హీరోయిన్‌లుగా రాణిస్తున్న వారు టాలీవుడ్ లో ఎంతోమంది ఉన్నారు. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించిన వారిలో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న పాప కూడా ఒకటి. కోడి రామకృష్ణ డైరెక్షన్లో 2000 సంవత్సరంలో వచ్చిన దేవుళ్ళు సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమాలో మీ ప్రేమ కోరే చిన్నారులం అంటూ వచ్చే ఓ పాట ఇప్పటికీ చాలామంది వింటూనే ఉంటారు. అయితే ఈ పాటలో ఆడి పాడిన నిత్య శెట్టి.. ఈ సినిమాలో తన నటనకు ఏకంగా నంది అవార్డును దక్కించుకుంది.

అలాగే రెండు నేషనల్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. చిన్ని చిన్ని ఆశ, లిటిల్ హార్ట్ సినిమాలతోనే నిత్య శెట్టి ఎంతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక తెలుగులో చాలామంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. తమిళ సోయగం అయినా చూడడానికి అచ్చ తెలుగు ఆడపిల్లల మెరుస్తూ టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించిన తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన నిత్య శెట్టి.. చదువుపై దృష్టి సారించింది. చదువు పూర్తయిన తర్వాత సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తూనే మరోవైపు మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి తన కలలను నిజం చేసుకోవాలి అనుకుంది.

2017లో నిత్య.. రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలో నటించిన దాగుడుమూతలు దండాకోర్‌ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ త‌ర్వాత‌ తమిళ్‌లోను మరో సినిమాలో నటించింది. అలాగే తెలుగులోనూ పడేసావే అనే సినిమాలో హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది. అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా అమ్మడికి వచ్చిన గుర్తింపు సినిమాల్లో మాత్రం రాలేదు. దాంతో ఇప్పటికే సరైన హిట్ కోసం ఆరాటపడుతూనే ఉంది నిత్య శెట్టి. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ షోలతో కుర్ర కారును ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ అమ్మడి లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. మీరు ఓ లుక్ వేసేయండి.